రత్నబాబు దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో సన్ ఆఫ్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్ళింది. అయితే కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడగా ఇటీవలే షూటింగ్ ను మళ్లీ మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా నుండి టైటిల్ పోస్టర్ అప్ డేట్ తప్పా ఇంతవరకూ ఎలాంటి అప్ డేట్ రాలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. జనవరి 29వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు.
కాగా ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయ రాజా సంగీతం అందిస్తున్నారు. అంతేకాదు మోహన్ బాబు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నాడు. మంచు విష్ణు భార్య.. మోహన్ బాబు కోడలు వెరోనికా ఈ సినిమాకు స్టయిలిస్ట్ గా పనిచేస్తున్నారు. మరి మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నా దేశం వంటి దేశభక్తి సినిమాల్లో నటించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పుడు మరోసారి దేశభక్తి నేపథ్యంలో సినిమాతో రాబోతున్నారు. చూద్దాం మరి ఈ సినిమా కల్లెక్షన్ కింగ్ కు ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: