కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2021

ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 91

సినిమా వార్తలు

'ఖిలాడి' లో యాక్షన్ కింగ్ 'అర్జున్'

రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేయగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా మరోసారి హుషారైన పాత్రలో రవితేజ నటిస్తున్నట్టు కనిపిస్తుంది.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'నారప్ప' రిలీజ్ డేట్ ఫిక్స్

వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘నారప్పగా’ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్ర‌స్తుతం చివ‌రి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్ప‌టికే విడుద‌లైన గ్లిమ్స్‌, పోస్ట‌ర్లకు, ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

కె.జి.యఫ్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్

సినీ లవర్స్ కు పండగే పండగ. గత ఏడాది థియేటర్స్ లేకపోవడంతో సినిమాలను చూసే అవకాశం లేకుండా పోయింది. ఇక ఈ ఏడాది మాత్రం థియేటర్లలో వరుస సినిమాలతో సందడి నెలకొననుంది. గత వారం రోజులుగా వరుసపెట్టి సినిమా రిలీజ్ ల అప్ డేట్ లు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది రిలీజ్ అవ్వాల్సిన పెండింగ్ లో ఉన్న సినిమాలతో పాటు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాల రిలీజ్ డేట్ లు కూడా వచ్చేసాయి. ఆర్ఆర్ఆర్, ఆచార్య, సర్కారు వారి పాట లాంటి పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ డేట్ లు కూడా ప్రకటించేసారు.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'ఆచార్య' రిలీజ్ డేట్ ఖరారు

2021 లో అందరూ ఎదురు చూసే సినిమాల్లో ఆచార్య సినిమా కూడా ఒకటి. మెగా సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసి బిగ్ సర్ఫరైజ్ ఇవ్వగా..టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. మెగా స్టార్ గ్రేస్ కు.. ఆయన యాక్షన్ సీన్స్ కు.. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. విజువల్స్ అన్నీ కలిసి చిరు-కొరటాల ఈ సారి గట్టిగా కొట్టేందుకు వస్తున్నట్టే ఉన్నారనిపిస్తుంది.

TFN Adminవాట్సాప్
Mega Star Chiranjeevi Acharya Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Megastar Chiranjeevi,Chiranjeevi,Actor Chiranjeevi,Megastar Chiranjeevi Acharya,Acharya,Acharya Movie,Acharya T
ట్రైలర్ & టీజర్

ఆచార్య టీజర్ రిలీజ్ - దైవమే కాపాడాల్సిన పనిలేదు

ఎప్పుడెప్పుడా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్న ఆచార్య టీజర్ వచ్చేసింది. ఈ రోజు టీజర్ ను రిలీజ్ చేస్తానని చెప్పిన ఆచార్య టీం చెప్పినట్టే టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక మెగా అభిమానుల ఆశించినట్టే.. వారి అంచనాలకు తగ్గట్టే ఈ టీజర్ ఉంది. ముందు నుండి చెప్పినట్టే రామ్ చరణ్ వాయిస్ తో టీజర్ ప్రారంభమైంది. మెగా స్టార్ మార్క్.. గ్రేస్ రెండూ టీజర్ లో కనిపిస్తున్నాయి. వయసు అనేది కేవలం నెంబర్ అన్నట్టు యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా చిరు చేసిన యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. అంతేకాదు మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నాయి. ఇతరుల కోసం జీవించే వారు దైవంతో…

TFN Adminవాట్సాప్
Adivi Sesh Major Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Adivi Sesh,Hero Adivi Sesh,Actor Adivi Sesh,Major,Major Movie,Major Film,Major Telugu Movie,M
రిలీజ్ అప్‌డేట్

'మేజర్' రిలీజ్ డేట్ ఫిక్స్

అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవల అడవి శేష్ పుట్టిన రోజు సందర్భంగా మేజర్ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన మూవీ మేకర్స్.. తాజాగా రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు. జులై 2, 2021న మేజర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మహేష్ బాబు, అడవి శేష్ ట్విట్ చేశారు.

TFN Adminవాట్సాప్
సాంగ్

2022 సంక్రాంతికి వచ్చేస్తున్న 'సర్కారు వారి పాట'

వరుస పెట్టి సినిమా రిలీజ్ ల అప్ డేట్స్ వచ్చేస్తున్నాయి. గత ఏడాది కరోనా వల్ల పెండింగ్ లో ఉన్న సినిమా రిలీజులన్నీ ఈఏడాది క్యూ కట్టాయి. ఇప్పటికే సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవ్వగా.. ఫిబ్రవరి, మార్చికి చాలా సినిమాలు థియేటర్ లో రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ కు మరో సర్పైజింగ్ అప్ డేట్ ఇచ్చారు 'సర్కారు వారి పాట' చిత్ర యూనిట్. మహేష్ సర్కారు వారి పాట ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఎదురు చూసిన అభిమానులకు ఇటీవలే కాస్త ఊరట కలిగింది. ఈసినిమా షూటింగ్ ను ఈ మధ్యనే ప్రారంభించారు. దుబాయ్ లోప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ సినిమా అప్ డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్

‘జనవరి 29న కానీ ఫిబ్రవరి 26న కానీ ప్రభాస్ సినిమా అప్ డేట్ కచ్చితంగా ఇస్తానని నాగ్ అశ్విన్ ప్రభ్స్ ఫ్యాన్స్ కు మాటిచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ప్రామిస్ చేసినట్టే ఎక్కువ టైమ్ తీసుకోకుండా అప్ డేట్ ఇచ్చాడు నాగ్ అశ్విన్. ఈ సినిమాకు పనిచేయబోయే సంగీత దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు.మహానటి సినిమాకు పని చేసిన స్పానిష్ టెక్నీషియన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనున్నారు. అలాగే మిక్కీ జే మేయర్ ను ఈ సినిమాకు సంగీతం దర్శకునిగా ఎంపికచేశారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'థ్యాంక్ యు బ్ర‌ద‌ర్' ట్రైలర్ రిలీజ్

ర‌మేష్ రాప‌ర్తి దర్శకత్వంలో అన‌సూయ భ‌ర‌ద్వాజ‌, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో 'థ్యాంక్ యు బ్ర‌ద‌ర్' టైటిల్ తో కరోనా బ్యాక్ డ్రాప్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అన్నిపనులు పూర్తి చేసుకొని ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్ లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చిది.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

'సన్ ఆఫ్ ఇండియా' ఫస్ట్ లుక్ రిలీజ్

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించి నిర్మించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గత కొద్దికాలంగా చాలా తక్కువ సినిమాల్లో కినిపించిన సంగతి తెలిసిందే. ఈ మధ్య సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ' ఆకాశం నీ హద్దురా..!' సినిమాలో భక్త వత్సల నాయుడు అనే కీలక పాత్రలో నటించాడు. ఇక ఇప్పుడు దేశభక్తి నేపథ్యంలో వస్తున్న 'సన్ ఆఫ్ ఇండియా' అనే సినిమాతో పూర్తి స్థాయి పాత్రతో వస్తున్నాడు. రత్నబాబు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్.. మిగిలిన షూటింగ్ పూర్తి చేసే పనిలో పడింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ - జెన్నీఫర్ గా ఎన్టీఆర్ హీరోయిన్

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ రెగ్యులర్ గా ఇస్తూనే ఉన్నాడు రాజమౌళి. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే రోజు ఈ సినిమా రిలీజ్ కూడా ప్రకటించాడు. అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని తెలిపారు. భారీ పీరియాడికల్‌ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లాక్ డౌన్ తర్వాత గ్యాప్ తీసుకోకుండా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ క్లైమాక్స్‌కు…

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు' టీజర్ రిలీజ్

ఎస్‌ దర్శన్‌ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం 'ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు' 'నో పార్కింగ్' అనేది ట్యాగ్ లైన్. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా గత ఏడాదే రిలీజ్ కావాలి కానీ కరోనా వల్ల చాలా లేట్ అయిపోయింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పవన్ తో కలిసి మీసం తిప్పుతున్న రానా

సాగర్‌ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో మలయాళంలో సూపర్‌ హిట్ అయిన 'అయ్యప్పనుమ్‌ కోశియనుమ్‌' సినిమా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో టాలెంటెడ్ హీరో రానా నటిస్తున్న సంగతి కూడా విదితమే. బిజు మీనన్‌ పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్‌ చేస్తుండగా.. రానా పృథ్వీరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.ఇక తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టారు. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. అక్కడ వేసిన…

TFN Adminవాట్సాప్
F3 Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,F3 Release Date Locked,F3 Movie Release Date Confirmed,Director Anil Ravipudi,Venkatesh,Varun Tej,Tamannaah
రిలీజ్ అప్‌డేట్

F3 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్2'. ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్‌లో నవ్వులు పూయించాడో తెలిసిందే. ఇక ఈ సినిమా సీక్వెల్ ను కూడా అనిల్ రావిపూడి లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లడమే లేట్. వెంకటేష్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈ సినిమాలో మూడో హీరో కూడా ఉన్నట్టు ఎప్పటినుండో వార్తలు వచ్చాయి . కానీ మూడో స్టార్ హీరోగా ఎవరూ చేయడం లేదని, అసలు…

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

విరాటపర్వం రిలీజ్ డేట్ ఫిక్స్

రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా 'విరాట‌ప‌ర్వం'. డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "రివ‌ల్యూష‌న్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్" అనేది ట్యాగ్‌లైన్‌. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్న 'విరాట‌ప‌ర్వం'ను ఏప్రిల్ 30న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చెన్నైలో స్టార్ హీరోయిన్ సమంత

టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. వర్కౌట్ , గార్డెనింగ్ వీడియోస్ షేర్ చేస్తూ సమంత అభిమానులను ఇన్ స్పైర్ చేస్తున్నారు."కాతువాకుల రెండు కాదల్ "తమిళ మూవీ లో నటిస్తున్న సమంత , నందిని రెడ్డి దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషల లో రూపొందనున్న హారర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'పుష్ప' రిలీజ్ డేట్ ఫిక్స్

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఇప్పటివరకూ ఆర్య, ఆర్య2 రాగా.. ఇప్పుడు మూడోసారి 'పుష్ప' సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా.. బన్నీ రస్టిక్ అండ్ రఫ్ లుక్‌లో లారీ డ్రైవర్‌గా కనబడనున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లిలో జరుగుతోంది. ఈ షెడ్యూలు తరువాత హైదరాబాద్.. దాని తరువాత కేరళలో మరో షెడ్యూలు జరుపుకోనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అఫీషియల్.. 'సలార్' లో 'శృతి'

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'సలార్' సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాను ఇటీవలే గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలోని భారీ యాక్షన్ సన్నివేశాలను తెలంగాణా లోని గోదావరి ఖని లో ఉన్న సింగరేణి గనుల్లో తెరకెక్కించనున్నట్టు.. ఇప్పటికే కోల్ మైన్ వద్ద ఏర్పాట్లు కూడా ప్రారంభించినట్టు వార్తలు కూడా వస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

థియేటర్స్ లో అధిక ఆక్యుపెన్సీ కి కేంద్రం గ్రీన్ సిగ్నల్

2020 లో కరోనా వల్ల అన్ని పరిశ్రమలు దాదాపు చాలా వరకూ నష్టపోయిన సంగతి తెలిసిందే. మరి ముఖ్యంగా సినీ పరిశ్రమ. చాలా పరిశ్రమలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ వుంది కానీ సినీ పరిశ్రమకు పరిస్థితి వేరు. షూటింగ్ లు జరిగితేనే సినీ కార్మికులకు ఆదాయం. మరి లాక్ డౌన్ లో సినీ పరిశ్రమ ఎలాంటి గడ్డుకాలం చూసిందో మనం కూడా చూసాం. షూటింగ్ లు లేవు.. మరో పక్క థియేటర్స్ మొత్తం మూత పడ్డాయి.. వేల కోట్లలో బిజినెస్ ఆగిపోయింది. ఎలాగొలా ఇప్పుడిప్పుడే ఆ నష్టం నుండి తేరుకుంటుంది. గత రెండు నెలల నుండి షూటింగ్ లు జరుగుతున్నాయి.. సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

ప్రభాస్ చేతుల మీదుగా 'ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు' టీజర్

చిలసౌ సినిమా తర్వాత సుశాంత్ హీరోగా మళ్లీ ఇంతవరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. గత ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు. ఆ పాత్రకు మంచి పేరే వచ్చిందనుకోండి. ఇక ప్రస్తుతం ఎస్‌ దర్శన్‌ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం 'ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు' 'నో పార్కింగ్' అనేది ట్యాగ్ లైన్. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా గత ఏడాదే రిలీజ్ కావాలి కానీ కరోనా వల్ల చాలా లేట్ అయిపోయింది.

TFN Adminవాట్సాప్

షేర్