సందీప్ కిషన్ , లావణ్య త్రిపాఠి జంటగా హాకీ గేమ్ నేపథ్యం లో వెంకటాద్రి టాకీస్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “A1 ఎక్స్ ప్రెస్ ” మూవీ ఫిబ్రవరి నెలలో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మురళీశర్మ , రావు రమేష్ , పోసాని , ప్రియదర్శి , రఘుబాబు ముఖ్య పాత్రలలో నటించారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“A1 ఎక్స్ ప్రెస్ ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై ఆసక్తిని కలిగించాయి. రిపబ్లిక్ డే సందర్భంగా నిన్న “A1 ఎక్స్ ప్రెస్ ” మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. హాకీ నేపథ్యంలో తెరకెక్కిన మొదటి తెలుగు సినిమా “A1 ఎక్స్ ప్రెస్ ”మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో సందీప్ కిషన్ రెండు తమిళ మూవీస్ తోపాటు “వివాహభోజనంబు “మూవీలో నటిస్తూ , నిర్మిస్తున్నారు. హీరోయిన్ లావణ్య , కార్తికేయ హీరోగా రూపొందుతున్న మాస్ ఎంటర్ టైనర్ “చావు కబురు చల్లగా ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























