కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2021

ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 63

Gully Rowdy Movie Team Unveils First Look and Announces Movie Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Gully Rowdy,Gully Rowdy Movie,Gully Rowdy Film,Gully Rowdy Telug
ఫస్ట్ లుక్

'గల్లీరౌడి' ఫస్ట్ లుక్ రిలీజ్ - రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసే ఈ కుర్రహీరో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ఇటీవల ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు సీనియర్ డైరెక్టర్ నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Republic Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Republic,Teaser,Sai Tej,Aishwarya Rajesh,Jagapathi Babu,Ramya,Deva Katta,Mani Sharma,Sai Dharam Tej,Hero Sai D
ట్రైలర్ & టీజర్

'రిపబ్లిక్' టీజర్ రిలీజ్

మెగాహీరో సాయి తేజ్ ఒకప్పుడు వరుస ఫ్లాప్స్ తో చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో సూపర్ ఫాంలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమాని టాలెంటెడ్ డైరెక్టర్ దేవాకట్ట దర్శకత్వంలో చేస్తున్నాడు. అయితే ఈసారి లవ్ స్టోరీ కాకుండా కాస్త డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నాడు. 'రిపబ్లిక్' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌తో పాటు పోస్టర్‌కి మెగా అభిమానులు, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా సాయి తేజ్, రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ లను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు. అవికూడా బాగా ఆకట్టుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Power Star Pawan Kalyan Turns Emotional During His Speech at Vakeel Saab Pre Release Event,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Film,V
సినిమా వార్తలు

"వకీల్ సాబ్ "ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఎమోషనల్ స్పీచ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ రికార్డ్ స్థాయిలో ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందిన “వకీల్ సాబ్ “మూవీలో నివేద థామస్ , అంజలి , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.హీరో పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందిన “వకీల్ సాబ్” మూవీ పోస్టర్స్, టీజర్ , ట్రైలర్ , సాంగ్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

Team TFNవాట్సాప్
Nivetha Thomas Tested Positive For Corona,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nivetha Thomas,Actress Nivetha Thomas,Heroine Nivetha Thomas,Nivetha Thomas Latest News,Nivetha T
సినిమా వార్తలు

నివేదా థామస్ కు కరోనా పాజిటివ్

కరోనా సెకండ్ వేవ్ లో కేసులు బాగానే పెరుగుతున్నాయి. ముఖ్యంగా సినీ ప్రముఖులు కూడా చాలా మంది మళ్లీ కరోనా బారిన పడుతున్నారు. గత ఏడాది కరోనా వల్ల సినీ పరిశ్రమ ఎంత నష్టపోయిందో తెలుసు. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నారు అనుకునే లోపు మళ్లీ సెకండ్ వేవ్ అంటూ కరోనా ప్రభావం ఎక్కువైపోయింది. ముంబైలో ఇప్పటికే చాలా మంది హీరో హీరోయిన్స్ కరోనా బారిన పడ్డారు. ఇక ఇప్పుడు నివేదా థామస్ కు కూడా కరోనా సోకింది.

TFN Adminవాట్సాప్
Most Eligible Bachelor Movie Ye Zindagi Song Release Date Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Most Eligible Bachelor Movie Song Release Date Out,Most Eligible Bachelor,Mos
సాంగ్

"మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా రూపొందిన"మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ జూన్ 19 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈషా రెబ్బా , ఆమని , మురళీశర్మ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , మనసా సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Anupama Parameswaran Latest Look Shared On Instagram Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Anupama Parameswaran,Anupama Parameswaran Movie,Anupama Parameswaran new Mo
సినిమా వార్తలు

అనుపమ లేటెస్ట్ లుక్

సూపర్ హిట్ "అ ఆ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుపమ పరమేశ్వరన్ "ప్రేమమ్ ", "శతమానం భవతి ", "హలో గురు ప్రేమ కోసమే ", "రాక్షసుడు "వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలెంటెడ్ యాక్ట్రెస్ గా గుర్తింపు పొందారు. అనుపమ ప్రస్తుతం ఒక మలయాళ షార్ట్ ఫిల్మ్ , ఒక తమిళ మూవీ , నిఖిల్ హీరోగా రూపొందుతున్న "18 పేజెస్ " మూవీ లో నటిస్తున్నారు. "నటసార్వభౌమ " మూవీ తో అనుపమ కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.

Team TFNవాట్సాప్
Youth Star Nithiin Becomes Busy Hero In Tollywood With Back To Back Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Maestro,Maestro Movie,Maestro Telugu Movie,Maestro Movie Update,
సినిమా వార్తలు

బిజీ యంగ్ హీరో నితిన్

సూపర్ హిట్ "జయం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నితిన్ బ్లాక్ బస్టర్ "దిల్ "మూవీ తో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. "ఇష్క్ ", "గుండె జారి గల్లంతయ్యిందే ", చిన్నదాన నీకోసం ", "అ ఆ ", "భీష్మ "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నితిన్ కథానాయకుడిగా రూపొందిన "రంగ్ దే !" మూవీ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. పలు మూవీ కమిట్ మెంట్స్ తో హీరో నితిన్ బిజీగా ఉన్నారు.

Team TFNవాట్సాప్
Major Team Announce Teaser Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Adivi Sesh’s Major,Adivi Sesh Major,Major Adivi Sesh,Major Movie Teaser,Major Movie Teaser Update,M
ట్రైలర్ & టీజర్

' మేజర్' - టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

'క్ష‌ణం', 'గూఢ‌చారి', 'ఎవరు' ఇలా వరుస హిట్స్ తో టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న నటుల్లో అడివి శేష్ కూడా ఒకడు. మొదటి నుండి డిఫరెంట్ కాన్సెప్ట్ లే ఎంచుకుంటాడు. ఇప్పుడు మరోసారి అలాంటి కథతోనే వస్తున్నాడు. అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Republic Movie Team Unveils Ramya Krishnan First Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ramya Krishnan,Actress Ramya Krishnan,Heroine Ramya Krishnan,Republic,Republic Movie,
ఫస్ట్ లుక్

'రిపబ్లిక్' - రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ రిలీజ్

దేవ్‌ క‌ట్టా ద‌ర్శక‌త్వంలో రిపబ్లిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని..పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. భార‌త‌దేశం స్వా తం త్య్రాన్ని సాధించి 74 ఏళ్లు అవుతుంది. డెబ్బై నాలుగేళ్ళుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకుతున్నాం, కానీ ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలీదు మనకు అంటూ ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలు వాటిలోని లోపాలను చూపించేలా సినిమా తీస్తున్నారని తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రీసెంట్ గానే సాయి తేజ్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఏప్రిల్‌ 5న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే…

TFN Adminవాట్సాప్
Kartikeya Gummakonda New Movie Update Is Out,Kartikeya Gummakonda New Movie Update Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kartikeya's Next,#KG7,KG7 First Update,Tanya,Rama Re
సినిమా వార్తలు

కార్తికేయ కొత్త సినిమా అప్ డేట్ వచ్చేసింది

యంగ్ హీరో కార్తికేయకు లక్ మాత్రం బాగానే ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్ ఎక్స్ 100 సినిమా తరువాత కార్తికేయకు చెప్పుకోదగిన హిట్ మాత్రం రాలేదు. అయినా కూడా ఈహీరోకు సినిమా అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. అది కూడా ఏదో చిన్న చితకా బ్యానర్స్ ఏం కాదు.. ఇటీవలే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చావు కబురు చల్లగా సినిమా చేశాడు. ఆ తర్వాత సుకుమార్ తో వెంటనే సినిమాను ప్రకటించాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈసినిమాకు క‌థ‌, స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లు సుకుమార్ అందిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Keerthy Suresh Dazzles In Half Saree In Her Latest Pictures Shared On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Keerthy Suresh Flaunts Beauty In Half Saree,Guruvayur Templ
సినిమా వార్తలు

హాఫ్ శారీ లో అందంగా కీర్తి సురేష్

సూపర్ హిట్ “నేను శైలజ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. తెలుగు , తమిళ, మలయాళ సూపర్ హిట్ మూవీస్ లో కీర్తి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ కీర్తి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కీర్తి 2తమిళ , 2మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
RRR Movie Team Plans To Reschedule Few Portions Of Alia Bhatt In The Movie,Alia Bhatt Tests Covid Positive,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Alia Bhatt,Actress Alia Bhatt,He
షూటింగ్ అప్‌డేట్

ఆర్ఆర్ఆర్ - అలియా వల్ల రీ షెడ్యూల్

రాజమౌళి ఎంత తొందరగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి చేయాలనుకున్నా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ఇక ఇప్పుడు అలియాకు కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ లో మళ్లీ కొన్ని మార్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని.. వెంటనే ఇంట్లోనే ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయినట్లు అలియా పేర్కొంది. వైద్యుల సలహా మేరకు ఎప్పటికప్పుడు అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుంటున్నానని తెలిపింది.

TFN Adminవాట్సాప్
Makers Of Vakeel Saab Movie Plans To Release Film On A Massive Scale,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Anjali,Box Office, Pawan Kalyan,Power Star Pawan Kalyan,Theatres,Tolly
సినిమా వార్తలు

రికార్డ్ స్థాయి లో "వకీల్ సాబ్" రిలీజ్

బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందిన “వకీల్ సాబ్ “మూవీలో నివేద థామస్ , అంజలి , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Sekhar Kammula Upcoming Release Love Story To Release Across Multiple Languages Simultaneously,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Love Story In Multiple Languages,Love Story,
సినిమా వార్తలు

తెలుగు , కన్నడ , మలయాళ భాషలలో "లవ్ స్టోరీ "రిలీజ్

ఫీల్ గుడ్ మూవీస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యం లో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. అమిగో క్రియేషన్స్ , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై రూపొందిన "లవ్ స్టోరీ "మూవీ లో దేవయాని, రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల , హీరో నాగచైతన్య ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది.

Team TFNవాట్సాప్
Vishal Announces His New Movie With An Innovative Motion Poster,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,VISHAL 31 - Official Announcement,Vishal,Thu Pa Saravanan,Yuvan Shankar Raj
ఫస్ట్ లుక్

విశాల్ 'నాట్ ఏ కామన్ మెన్'

తెలుగువాడైనా ఇక్కడ కంటే ఎక్కువగా తమిళ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ కోలీవుడ్ లో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు విశాల్. ఇక తమిళ్ తో పాటు తెలుగులో కూడా తన సినిమాలు రిలీజ్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక విశాల్ సినిమాల్లో ప్రయోగాలు కూడా బాగానే చేస్తుంటాడు. ఎప్పుడూ రెగ్యులర్ కమర్షియల్ కథలే కాకుండా డిఫరెంట్ కథలని ఎంపిక చేసుకుంటూ, ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలతో ఈ మధ్యకాలంలో వరుసగా హిట్స్ తో దూసుకుపోతున్నాడు.

TFN Adminవాట్సాప్
Pushpa Movie Team Reveals Date For Unveiling Pushpa Raj Fierce Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Movie Telugu,Pushpa Film
సినిమా వార్తలు

'పుష్ప రాజ్' కు టైమ్ ఫిక్స్

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'పుష్ప'. శేషాచలం అడువుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్‌ అనే లారీ డ్రైవర్‌ పాత్రలో చిత్తూరు జిల్లా యాసలో ఇరగదీయనున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే మారేడు మిల్లి, రంపచోడవరం, టెన్ కాశీ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోగా.. తర్వాతి షెడ్యూల్‌ను చిత్తూరుతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని సత్య మంగళం అడవుల్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Pushpa Movie Team Plans To Release An Interesting Line Up Of Updates This Week,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Movie Telugu,
సినిమా వార్తలు

పుష్ప 'లోడ్ దింపతాండం'

సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా వస్తున్న సినిమా పుష్ప. పుష్ప రాజ్ అనే డ్రైవర్ పాత్రలో ఫుల్ మాస్ అండ్ రస్టిక్ లుక్ లో బన్నీ ఈసారి బాక్సాఫీస్ వద్ద దాడి చేయడానికి సిద్దమవుతున్నాడు. ఇప్పటికే బన్నీ లుక్ ను చూసే సినిమాపై ఓరేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి.

TFN Adminవాట్సాప్
Raashi Khanna To Pair Up With Naga Chaitanya Once Again After Venky Mama,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Raashi Khanna Signs Naga Chaitanya’s Thank You,Raashi Khanna,Actre
సినిమా వార్తలు

నాగచైతన్య తో మరోసారి జోడీగా రాశీఖన్నా

నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందిన "లవ్ స్టోరీ " మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 16 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కథానాయిక. హీరో నాగచైతన్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "మనం "మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "థ్యాంక్ యు " మూవీ లో నటిస్తున్నారు. హీరో నాగచైతన్య కు జోడీగా అందాల రాశీఖన్నా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
Power Star Pawan Kalyan Takes Intense Training For Hari Hara Veera Mallu Action Sequences,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pawan Kaylan,Power Star Pawan Kaylan,Hero Pawan K
సినిమా వార్తలు

వీరమల్లు - పవన్ డెడికేషన్

క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.పవన్ కూడా ఎలాంటి బ్రేక్స్ లేకుండా వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తిచేయాలని చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పవన్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా పవన్ లుక్ కు అందరూ ఫిదా అయిపోయారు. అంతేకాదు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గెటప్.. ఆయన కాస్ట్యూంస్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు కూడా.

TFN Adminవాట్సాప్
V Movie Hindi Dubbing Version To Release Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,V Movie,V,V Film,V Movie update,V Movie Latest Update,V Film Update,V Movie News,V Movie Late
సినిమా వార్తలు

"V" మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ త్వరలో రిలీజ్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ COVID-19 కారణంగా థియేటర్స్ మూతబడడంతో అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా 2020 సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. హీరో నాని సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందిన "V" మూవీ లో హీరో నాని ఫస్ట్ టైమ్ నెగటివ్ క్యారెక్టర్ , సుధీర్ బాబు డిసిపి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు.

Team TFNవాట్సాప్

షేర్