
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 64


దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ పై రజనీకాంత్ స్పందన

సుల్తాన్ మూవీ పబ్లిక్ టాక్

పవన్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ15 సినిమాలు

ఉగాదికి "టక్ జగదీష్ "ట్రైలర్ రిలీజ్

వైల్డ్ డాగ్ మూవీ పబ్లిక్ టాక్

"వకీల్ సాబ్ "సెన్సార్ కంప్లీట్

ఏప్రిల్ నెలలో సినిమాల సందడి

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ విన్నర్ రజనీకాంత్

సితార "డబల్ ట్రబుల్ "

సమంత ఇన్ స్టాగ్రామ్ రికార్డ్

త్వరలో సెట్స్ కు "అంటే .. సుందరానికి ! "

"సుల్తాన్" ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక

సత్యదేవ్ "తిమ్మరుసు" రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ చరణ్ "రంగస్థలం " స్వీట్ మెమరీస్

హీరో నాని న్యూ లుక్
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు.హీరో నాని ప్రస్తుతం రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సాయి పల్లవి , కృతిశెట్టి కథానాయికలు.

వైల్డ్ డాగ్ మూవీ రివ్యూ - ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్
సినిమాలో పాటలు అయితే ఏం లేవులే కానీ థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే ఈ జోనర్ లో సినిమాలను ఇష్టపడే వాళ్లకు సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ పై రజనీకాంత్ స్పందన
“అపూర్వ రాగంగళ్ “(1975 ) మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రజనీకాంత్ దక్షిణాది భాషలతో పాటు హిందీ , బెంగాలీ భాషలలో నటిస్తూ , తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు . నాలుగున్నర దశాబ్దాలుగా కళామతల్లికి సేవలందించిన రజనీకాంత్ పద్మ భూషణ్ , పద్మ విభూషణ్ సత్కారాలు అందుకున్నారు. ఇప్పుడు మరో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ కు రజనీకాంత్ ఎంపిక అయ్యారు .హీరో రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.

సుల్తాన్ మూవీ పబ్లిక్ టాక్
రెమో ఫేమ్ బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో కార్తీ, రష్మిక హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా ‘సుల్తాన్’.

'RRR' అజయ్ దేవగన్ మోషన్ పోస్టర్ రిలీజ్ - 'లోడ్..ఎయిమ్..షూట్'
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మరోవైపు ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాకముందే ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం రికార్డు స్థాయిలో జరుగుతుంది. ఇప్పటికే తమిళ్, కన్నడ, హిందీ హక్కులను పెద్ద మొత్తంలో చెల్లించి సొంతం చేసుకున్నారు నిర్మాతలు.

పవన్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ15 సినిమాలు
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడు మాములుగా లేదుగా. ఒకప్పుడు అసలు సినిమాలకు గుడ్ బై చెపుతాడేమో అనుకుంటుండగా.. మళ్లీ రీఎంట్రీ ఇచ్చి షాకివ్వడమే కాకుండా ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఆతరువాత హరీష్ శంకర్ తో సినిమా చేయనున్నాడు.

ఉగాదికి "టక్ జగదీష్ "ట్రైలర్ రిలీజ్
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని , రీతూ వర్మ జంటగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ ఏప్రిల్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. ఐశ్వర్య రాజేష్ మరో కథానాయిక కాగా జగపతి బాబు , నాజర్ , రావు రమేష్ ముఖ్యపాత్రలలోనటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

వైల్డ్ డాగ్ మూవీ పబ్లిక్ టాక్
అహిషోర్ సోల్మన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన సినిమా వైల్డ్ డాగ్. ఈ సినిమాలో నాగార్జున ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయవర్మ పాత్రలో కనిపిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. ఈపాటికి రిలీజ్ కూడా అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయితే కరోనా వల్ల మరింత లేట్ అయింది.

పవన్ కళ్యాణ్ గారి కాంప్లిమెంట్ మర్చిపోలేను - అంజలి
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాను వకీల్ సాబ్ గా తెలుగులో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవర్ స్టార్ క్రేజ్ ను బట్టి.. స్టామినా ను బట్టి మన తెలుగు ప్రేక్షకులు పవన్ నుండి ఎలాంటి అంశాలు కోరుకుంటారో అవన్నీ యాడ్ చేశారు. మరోవైపు ఈసినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడు చూసేద్దామా అని ఈగర్ గా వైయిట్ చేస్తున్నారు. ఇక రిలీజ్ ఇంకా ఒక్క వారం మాత్రమే ఉండటంతో వీలైనంత ఎక్కువ ప్రచారం కల్పించడానికే చూస్తున్నారు చిత్రయూనిట్. ఇదిలా ఉండగా ఈసినిమాలో ఒక కీలక పాత్రలో అంజలి నటించిన సంగతి తెలసిందే. ప్రమోషన్ కార్యక్రమాల్లో…

'అర్జున్ రెడ్డి' రీమేక్ డైరెక్టర్ తో వైష్ణవ్ తేజ్
మెగా కాంపౌండ్ నుండి వచ్చి ఒక్క సినిమాతో ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోస్ కే పోటీ ఇస్తున్నాడు. ఆహీరో ఇంకెవరూ సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వైష్ణవ్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతూ బిజీ అయిపోతున్నాడు. అంతేనా పెద్ద పెద్ద బ్యానర్స్ లోనే చాన్స్ లు కొట్టేస్తున్నాడు.

"వకీల్ సాబ్ "సెన్సార్ కంప్లీట్
బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నివేద థామస్ , అంజలి , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా “వకీల్ సాబ్ “మూవీ రూపొందింది.

ఏప్రిల్ నెలలో సినిమాల సందడి
ఏప్రిల్ నెలలో హీరోలు పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్ ", నాగార్జున "వైల్డ్ డాగ్ ", నాగచైతన్య "లవ్ స్టోరీ ", నాని "టక్ జగదీష్ ", కార్తీ "సుల్తాన్ "మూవీస్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. "సుల్తాన్ "మూవీ తో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు . ఏప్రిల్ నెలలో రిలీజ్ అయ్యే అన్ని సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ విన్నర్ రజనీకాంత్
"అపూర్వ రాగంగళ్ "(1975 ) మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రజనీకాంత్ "అంతులేని కథ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కెరీర్ ప్రారంభం లో నెగటివ్ రోల్స్ లో నటించిన రజనీకాంత్ తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో హీరోగా మారి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న రజనీకాంత్ దక్షిణాది భాషలతో పాటు హిందీ , బెంగాలీ భాషలలో 165 సినిమాలకు పైగా నటించారు. నాలుగున్నర దశాబ్దాలుగా కళామతల్లికి సేవలందించిన రజనీకాంత్ పద్మ భూషణ్ , పద్మ విభూషణ్ సత్కారాలు అందుకున్నారు. ఇప్పుడు మరో అత్యున్నత పురస్కారానికి రజనీకాంత్ ఎంపిక అయ్యారు .

సితార "డబల్ ట్రబుల్ "
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ , డ్యాన్స్ వీడియోస్ షేర్ చేసి ప్రేక్షక, అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. 8 సంవత్సరాల వయస్సు ఉన్న సితార కు స్వంతంగా యూట్యూబ్ ఛానల్ ఉండడం విశేషం. తన తాజా ఫొటో షూట్స్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తున్న సితార తాజాగా ఆరెంజ్ ఫ్రాక్ తో ఉన్న తన ఫోటోలను షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

సమంత ఇన్ స్టాగ్రామ్ రికార్డ్
సూపర్ హిట్ "ఏ మాయ చేసావె " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సమంత ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ "శాకుంతలం " మూవీ లో శకుంతల గా నటిస్తున్నారు. ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటిస్తున్నందుకు సమంత తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

త్వరలో సెట్స్ కు "అంటే .. సుందరానికి ! "
సక్సెస్ ఫుల్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ " మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. హీరో నాని ప్రస్తుతం రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ "శ్యామ్ సింగ రాయ్ "మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి , బ్లాక్ బస్టర్ "ఉప్పెన "మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయికలు. "శ్యామ్ సింగ రాయ్ "మూవీ షూటింగ్ 40 శాతం పైగా కంప్లీట్ అయ్యింది.

ఏప్రిల్ 5న అఖిల్ అక్కినేని ఏ జిందగీ పాట విడుదల
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’…

"సుల్తాన్" ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక
తెలుగు , కన్నడ చిత్ర పరిశ్రమలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. “సుల్తాన్ “మూవీ తో రష్మిక కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. “మిషన్ మజ్ను “మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్న రష్మిక ప్రస్తుతం “పుష్ప ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు.

సత్యదేవ్ "తిమ్మరుసు" రిలీజ్ డేట్ ఫిక్స్
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ , ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో "బ్లఫ్ మాస్టర్ ", "ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య "మూవీస్ ఫేమ్ సత్యదేవ్ హీరోగా అసైన్ మెంట్ వాలి ట్యాగ్ లైన్ తో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ "తిమ్మరుసు "మూవీ మే 21 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రియాంక జువాల్కర్ కథానాయిక. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

రామ్ చరణ్ "రంగస్థలం " స్వీట్ మెమరీస్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత జంటగా గ్రామీణ నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా "రంగస్థలం "మూవీ 2018 సంవత్సరం మార్చి 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వినికిడి లోపం ఉన్న చిట్టి బాబు గా రామ్ చరణ్ , రామలక్ష్మి గా సమంత , రంగమ్మత్త గా అనసూయ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.