
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 62


రాధేశ్యామ్ - కాలేజ్ డీన్ గా సచిన్ ఖేదేకర్

"గుడ్ బై " సెట్స్ లో రష్మిక బర్త్ డే వేడుక

రష్మిక స్వీట్ రిక్వెస్ట్ కు బన్నీ గ్రీన్ సిగ్నల్

ఫాదర్స్ డే కి దృశ్యం 2..?

సినీ కార్మికులకు ఉచిత వ్యాక్సిన్ - చిరంజీవి

'వకీల్ సాబ్' ఫస్ట్ షో టైమ్

ఎన్.ఐ.ఏ ఆఫీసర్ గా కార్తికేయ

రష్మిక క్యూట్ లుక్

కరోనా వచ్చింది.. కానీ..!

"వరుడు కావలెను "డబ్బింగ్ ప్రారంభం

"దృశ్యం 2 " మూవీ అప్ డేట్

నాని "టక్ జగదీష్" వర్కింగ్ స్టిల్

సాయి పల్లవి న్యూ శారీ లుక్

'అఖిల్' రెడీ టూ కిల్ - పస్ట్ లుక్ కు టైమ్ ఫిక్స్
అఖిల్-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమాను అధికారికంగా ప్రకటించారు. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 'ఎ ఈజ్ రెడీ టు కిల్, ఎస్ ఈజ్ రెడీ టు స్టన్' అంటూ ఏప్రిల్ 8న ఉదయం 9గంటల 9నిమిషాలకు ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. దీనితో ఇది ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.

రాధేశ్యామ్ - కాలేజ్ డీన్ గా సచిన్ ఖేదేకర్
బాహుబలి1, బాహుబలి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న "రెబల్‌స్టార్" ఇప్పుడు మరోపాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ తో వస్తున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈసినిమాలో ప్రభాస్ విక్రమాధిత్య పాత్రలో నటిస్తుండగా.. పూజాహెగ్డే ప్రేరణ పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే విడుదుల చేసిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక మరో అప్ డేట్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

"గుడ్ బై " సెట్స్ లో రష్మిక బర్త్ డే వేడుక
టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక "సుల్తాన్ "మూవీ తో కోలీవుడ్ , "స్పై థ్రిల్లర్ "మిషన్ మజ్ను "మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. "ఆడాళ్ళూ మీకు జోహార్లు "మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు. రష్మిక తన రెండవ బాలీవుడ్ మూవీ "గుడ్ బై " కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రష్మిక కథానాయికగా పలు భాషల మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

రికార్డ్ కలెక్షన్స్ తో "జాతిరత్నాలు "
అనుదీప్ కె వి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మాణ సారథ్యంలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “జాతిరత్నాలు” మూవీ శివరాత్రి కానుకగా మార్చి 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. ఫరియా అబ్దుల్లా కథానాయిక కాగా మురళీశర్మ , బ్రహ్మానందం , వెన్నెల కిషోర్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటించారు. రాధన్ సంగీతం అందించారు.

రష్మిక స్వీట్ రిక్వెస్ట్ కు బన్నీ గ్రీన్ సిగ్నల్
రష్మిక మందన్న పుట్టిన రోజు నిన్న జరిగిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ భామకు ఫ్యాన్స్, పలువురు సినీ ప్రముఖుల నుండి బర్త్ డే విషెస్ కూడా అందాయి. అంతేకాదు ఆమె నటిస్తున్న పలు సినిమాల నుండి అప్ డేట్స్ కూడా వచ్చాయి. అయితే ఒక్క విషయంలో మాత్రం రష్మిక ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారు. పుష్ప సినిమా నుండి మాత్రం రష్మిక అప్ డేట్ ఒక్కటి కూడా రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఫాదర్స్ డే కి దృశ్యం 2..?
జీతూజోసఫ్ దర్శకత్వంలో వెంకీ హీరోగా దృశ్యం సీక్వెల్ దృశ్యం 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్ తో చేస్తున్నారు. ఇప్పటికే కీలకమైన పోర్షన్స్ మొత్తం పూర్తి చేసినట్టు తెలుస్తుంది. వెంకీ ఈసినిమా కంటే ముందు మొదలు పెట్టిన ఎఫ్ 3 సినిమా కూడా ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. కానీ ఈసినిమా షూటింగ్ మాత్రం దాదాపు చివరి దశకు వచ్చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఏప్రిల్ చివరికల్లా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని అంటున్నారు.

సినీ కార్మికులకు ఉచిత వ్యాక్సిన్ - చిరంజీవి
కరోనా మహమ్మారి కారణంగా మూవీ షూటింగ్స్ నిలిచిపోయి రోజు వారీ వేతనాలతో జీవించే సినీ కార్మికులు పలు ఇబ్బందులకు గురి అయిన విషయం తెలిసిందే. ఆ సమయం లో మెగా స్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ ప్రారంభించి , సినీ ప్రముఖుల నుండి విరాళాలు సేకరించి, నిత్యావసర వస్తువులు సినీ కార్మికులకు అందజేసి వారిని ఆదుకున్నారు.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'-'ఏ జిందగీ' సాంగ్ రిలీజ్
ఇప్పుడున్న యంగ్ హీరోల్లో అర్జంటుగా హిట్ కావాల్సిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది అఖిల్ అని చెప్పొచ్చు. వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్సే అయ్యాయి... ఇప్పుడు ఆశలన్నీ నాలుగో సినిమా అయిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` సినిమాపైనే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా వస్తున్నసినిమా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఈ సినిమా నుండి పలు పోస్టర్స్, ప్రీ టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. జూన్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

'వకీల్ సాబ్' సెన్సాార్ రివ్యూ
ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

'వకీల్ సాబ్' ఫస్ట్ షో టైమ్
దాదాపు 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలున్నాయి. అలాగే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్.. ఓ రేంజ్‌లో ఉండటంతో.. సినిమా బ్లాక్‌బస్టర్ పక్కా అని అప్పుడే ఇండస్ట్రీ అంతా చర్చలు నడుస్తున్నాయి. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది. యూఏ సర్టిఫికెట్ అందించారు సెన్సార్ బృందం.

ఎన్.ఐ.ఏ ఆఫీసర్ గా కార్తికేయ
సూపర్ హిట్ “RX 100 “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని కార్తికేయ క్రేజీ హీరోగా మారారు. “హిప్పీ “, “గుణ 369 “, “90 ML “మూవీస్ తో కార్తికేయ ప్రేక్షకులను అలరించారు. విలన్ పాత్రలంటే ఆసక్తి ఉన్న కార్తికేయ , నాని హీరోగా రూపొందిన “గ్యాంగ్ లీడర్ “మూవీ లో నెగటివ్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే.స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా రూపొందుతున్న “వాలిమై “తమిళ మూవీ లో కార్తికేయ ప్రతినాయకుడిగా ఎంపిక అయ్యారు.

రష్మిక క్యూట్ లుక్
తెలుగు , కన్నడ చిత్ర పరిశ్రమలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. “సుల్తాన్ “మూవీ తో రష్మిక కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను “మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్న రష్మిక, బిగ్ బీ అమితాబ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న "గుడ్ బై "మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కరోనా వచ్చింది.. కానీ..!
బాలీవుడ్ లో ఇప్పటికే చాలామంది నటీ నటులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అంతేకాదు అక్కడ థియేటర్స్ కూడా మూసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు చిన్నగా టాలీవుడ్ లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలామందికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అల్లు అరవింద్ కూడా తనకు కరోనా వచ్చిందని నిర్ధారించారు. ఈమేరకు అందరికీ ఒక సలహా ఇస్తూ వీడియో కూడా రిలీజ్ చేశాడు.

"వరుడు కావలెను "డబ్బింగ్ ప్రారంభం
పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య , రీతూ వర్మ జంటగా "వరుడు కావలెను "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మురళీశర్మ , నదియా , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

"దృశ్యం 2 " మూవీ అప్ డేట్
సురేష్ ప్రొడక్షన్స్ , రాజ్ కుమార్ థియేటర్స్ , వైడ్ యాంగిల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై శ్రీప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా ఆపదలనుండి కుటుంబాన్ని రక్షించుకునే నేపథ్యంలో రూపొందిన బ్లాక్ బస్టర్ "దృశ్యం "మలయాళ మూవీ తెలుగు రీమేక్ "దృశ్యం "మూవీ ఘనవిజయం సాధించింది. హీరో వెంకటేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు "దృశ్యం " మూవీ కి సీక్వెల్ "దృశ్యం 2" మూవీ తెరకెక్కుతుంది.

'101 జిల్లాల అందగాడు' టైటిల్ సాంగ్ రిలీజ్
రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వంలో అవసరాల శ్రీనివాస్, రుహనీ శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా '101 జిల్లాల అందగాడు'. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుండగానే అప్పుడే ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ఈసినిమాలో గొత్తి సూర్య నారాయణ అనే పాత్రలో నటిస్తున్న అవసరాల బట్టతలతో పడే పాట్లను చూపించనున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తిని కలిగించారు.

'ఆడవాళ్లు మీకు జోహార్లు' రష్మిక ఫస్ట్ లుక్ రిలీజ్
ఇప్పుడున్న కాంపిటీషన్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే చాలా కష్టం. కానీ తన అందం.. అభినయం.. టాలెంట్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది రష్మిక మందన్న. ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది ఈ కన్నడ చందనం. ఇక ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరోపక్క అన్ని లాంగ్వేజెస్ లో కూడా హీరోయిన్ గా వరుస అవకాశాలు సొంతం చేసుకుంటుంది. బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా నటిస్తున్న ‘మిషన్ మజ్ను' సినిమాలో రష్మిక హీరోయిన్ గా చేసింది. దీనితో పాటు బిగ్ బీ తో కలిసి మరో సినిమా చేస్తుంది.

నాని "టక్ జగదీష్" వర్కింగ్ స్టిల్
హీరో నాని , రీతూ వర్మ జంటగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ ఏప్రిల్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. ఐశ్వర్య రాజేష్ మరో కథానాయిక కాగా జగపతి బాబు , నాజర్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. దర్శకుడు శివ నిర్వాణ, హీరో నాని కాంబినేషన్ లో రూపొందిన "నిన్నుకోరి " మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

సాయి పల్లవి న్యూ శారీ లుక్
బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి ఆ మూవీ లో తెలంగాణ యువతి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. తెలుగు , తమిళ , మలయాళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సాయి పల్లవి టాలెంటెడ్ యాక్ట్రెస్ గా గుర్తింపు పొందారు. సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన "లవ్ స్టోరీ "ఏప్రిల్ 16 వ తేదీ ,"విరాటపర్వం "మూవీ ఏప్రిల్ 30 వ తేదీ రిలీజ్ కానున్నాయి.

'వైల్డ్ డాగ్' ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా
అహిషోర్ సోల్మన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన సినిమా వైల్డ్ డాగ్. ఈ సినిమాలో నాగార్జున టెర్రరిస్టులను మట్టుబెట్టే ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయవర్మ పాత్రలో చేశాడు. చాాలా కాలం తరువాత నాగ్ మళ్లీ మరో డిఫరెంట్ మేకోవర్ తో వచ్చాడు. ఇక ఈసినిమా ఏప్రిల్ 2న రిలీజ్ అయి మంచి ప్రశంసలే దక్కించుకుంటుంది.