
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 32


రిలీజ్‌కు సిద్ధమవుతున్న గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్`

'మా' రేస్ లో మంచు విష్ణు

ముగింపు దశలో "ఖిలాడి "

హీరో నితిన్ తో మరోసారి ?

'రిపబ్లిక్' డబ్బింగ్ రీస్టార్ట్

దిల్ రాజు మంచి మనసు

అశోక్ గల్లా సినిమా టైటిల్ టీజర్ కు టైమ్ ఫిక్స్

మహేష్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ ప్రారంభం

ఒకే ఫ్రేమ్ లో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్

కియారా ను లాక్ చేసిన శంకర్..!

ఫస్ట్ కాపీ రెడీ చేస్తున్న 'నారప్ప'

'అలా అమెరికాపురములో' అంటున్న థమన్

షూటింగ్ నిబంధనలు.. వ్యాక్సీన్ వేసుకుంటేనే

పుష్ప లో సర్ ప్రైజింగ్ గా నా రోల్..!

ఫిదా బ్యూటీకి బాలీవుడ్ ఆఫర్..!

'దృశ్యం-2' రీమేక్- గౌతమి ప్లేస్ లో మీనా

ఉచిత విద్య ,వైద్యం సోనూసూద్ డ్రీమ్

కీర్తి సురేష్ బ్లాక్ &వైట్ ఫొటో

టాలీవుడ్ 'మిషన్ ఇంపాజిబుల్'లో తాప్సీ

యోగాసనం లో అనసూయ
అద్భుతంగా యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్టివ్ గా ఎంపిక చేసుకుంటూ నటిస్తున్నారు . బ్లాక్ బస్టర్ “రంగస్థలం “మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనసూయ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం“పుష్ప “, “రంగమార్తాండ “, “థ్యాంక్యూ బ్రదర్ “, “ఖిలాడి “, “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

రిలీజ్‌కు సిద్ధమవుతున్న గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్`
మ్యాచో హీరో గోపీచంద్, నయనతార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆరడుగుల బుల్లెట్’. నిజానికి 2017లో విడుదలవాల్సిన సినిమా ఇది. కానీ డైరెక్టర్ మారడం.. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ఇక ఇన్నేళ్ల తర్వాత ఎట్టకేలకు ఈసినిమా రిలీజ్ కు టైమ్ కలిసొచ్చింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. థియేటర్స్ రీ ఓపెన్ కాగానే ‘ఆరడుగుల బుల్లెట్` చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్మాత తాండ్ర రమేష్ ఓన్ రిలీజ్ చేస్తుండటం విశేషం. త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను…

'మా' రేస్ లో మంచు విష్ణు
మా ఎన్నికల టైమ్ స్టార్ట్ అయింది. నిజానికి గత మా ఎన్నికల్లో జరిగినంత రచ్చ మరెప్పుడూ జరగలేదు. శివాజీ రాజా వర్సెస్ నరేష్ ఎపిసోడ్స్ రచ్చకెక్కడం .. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడంతో మా అసోసియేషన్ పరువు పోయినంత పనైంది. దీంతో ఈసారి అలా జరగకుండా ఉండాలని ఇండస్ట్రీ పెద్దలు చూస్తున్నారట. కరోనా కారణంగా 2021-22 సీజన్ కి కొత్త అధ్యక్షుడి ఎంపిక ఇప్పటికే ఆలస్యమైంది. ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పటికే ప్రకటించారు. ఆయన ప్రచారంలో దూసుకుపోతుండగా.. ఇప్పుడు మంచు విష్ణు కూడా ఈ పదవి కోసం పోటీపడుతూ వార్ లోకి వచ్చారు. దీంతో ఈసారి మా ఎన్నికల వేడి ఊపందుకుంది. ఇప్పటికే ఇరు…

ముగింపు దశలో "ఖిలాడి "
ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

హీరో నితిన్ తో మరోసారి ?
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ కుడుముల దర్శకత్వం లో నితిన్ , రష్మిక జంటగా రూపొందిన "భీష్మ " మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో నితిన్ , హీరోయిన్ రష్మిక తమ తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. నితిన్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ మూవీ లో చూడ చక్కనిజంటగా ప్రేక్షకులను ఆకట్టుకున్న నితిన్ ,రష్మిక లు మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు.

'రిపబ్లిక్' డబ్బింగ్ రీస్టార్ట్
సాయి తేజ్ నెక్స్ట్ సినిమాని టాలెంటెడ్ డైరెక్టర్ దేవాకట్ట దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసారి లవ్ స్టోరీ కాకుండా కాస్త డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నాడు. 'రిపబ్లిక్' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌తో పాటు పోస్టర్లకు, టీజర్ ను రిలీజ్ చేయగా మెగా అభిమానులు, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈసినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు. అయితే సెకండ్ వేవ్ వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా బ్రేక్ పడింది. అయితే పరిస్థితులు కాస్త నార్మల్ కు రావడంతో.. లాక్ డౌన్ కూడా తీసేయడంతో షూటింగ్ లు మొదలయ్యాయి. దీనిలో భాగంగానే ఈసినిమా కూడా…

దిల్ రాజు మంచి మనసు
ప్రస్తుతం కరోనాను ఎదుర్కొనేందుకు అందరికీ ఒక్కటే ఆయుధం ముందుంది. అదే వ్యాక్సినేషన్. కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలంటూ ప్రభుత్వాలు ప్రజలందరికీ సూచిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ సంస్థలు కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లను చేపడుతున్నారు. ఈ నేపథ్యం లో సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా తమ సిబ్బంధికి , తన చిత్రాలకు పని చేస్తున్న వారికి తన కార్యాలయంలోనే వ్యాక్సిన్ వేయించారు.

అశోక్ గల్లా సినిమా టైటిల్ టీజర్ కు టైమ్ ఫిక్స్
టిడిపి ఎంపి గల్లా జయదేవ్, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరో గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మేజర్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

మహేష్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ ప్రారంభం
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ కథానాయిక. దుబాయ్ లో ఒక షూటింగ్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ రెండవ షెడ్యూల్ ప్రారంభం అయిన వెంటనే కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో #SSMB 28 ” మూవీ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.#SSMB 28 ” మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

ఒకే ఫ్రేమ్ లో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల మధ్య ఎంత పోటీ ఉంటుందో తెలుసు.. కానీ ఎంత పోటీ ఉన్నా ఒకరికొకరు మాత్రం సపోర్ట్ చేసుకుంటూనే ఉంటారు... సన్నిహితంగా ఉంటారు. అలానే దర్శకులు కూడా. ఇండస్ట్రీలో దర్శకుల మధ్య హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది. ఎవరు హిట్స్ ఇచ్చినా కూడా వెంటనే మరొకరు ఫోన్ చేసి విష్ చేస్తుంటారు. గతంలో టాప్ డైరెక్టర్స్ అందరూ కలిసి పార్టీలు చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఒక్కసారి మాత్రమే కాదు వీలు దొరికిన ప్రతీసారి రెగ్యులర్‌గా పార్టీలు చేసుకుంటూనే ఉంటారు మన దర్శకులు.

కియారా ను లాక్ చేసిన శంకర్..!
రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. చాలా వరకూ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ లేకపోతే కనీసం షూటింగ్ అయినా ఈపాటికి పూర్తయ్యేది. మరోవైపు ఆచార్య సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు కాకుండా మరోవైపు చరణ్ ఏస్ డైరెక్టర్ శంకర్ తో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. లైకాకు.. శంకర్ కు మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ వల్ల మరి ఈసినిమా ఎంత వరకూ సెట్స్ పైకి వెళుతుందో తెలియదు కానీ రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వినిపిస్తూనే ఉంది.

ఫస్ట్ కాపీ రెడీ చేస్తున్న 'నారప్ప'
యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు వెంకీ. జీతూ జోసఫ్ దర్శకత్వంలో వెంకీ ప్రధాన పాత్రలో దృశ్యం రీమేక్ దృశ్యం 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా అలా మొదలుపెట్టాడో లేదో అప్పుడే షూటింగ్ ను పూర్తి చేసేశాడు. ఇక ఈసినిమా కంటే ముందే శ్రీకాంత్ అడ్డాలతో నారప్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ హీరోగా తమిళ్ లో సూపర్ హిట్అయిన అసురన్ సినిమాకు రీమేక్ ఈసినిమా. ఇక ఈ సినిమా విషయంలో వెంకీ చాలా కేర్ తీసుకుంటున్నాడని... అనంతపురం యాస అన్ని పర్‌ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటున్నాడని వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే.

'అలా అమెరికాపురములో' అంటున్న థమన్
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. అంతేకాదు బన్నీ కెరియర్ లోనే ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకొని కెరీర్ బెస్ట్ సినిమాగా నిలిచింది. ఇక ఈసినిమాలో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థమన్ సూపర్ హిట్ ఆడియోను అందించాడు. 'సామాజ వరగమనా' ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పటినుండి మొదలైన రికార్డుల మోత ఇప్పటికీ కొనసాగుతుంది. 'బుట్ట బొమ్మ', రాములో రాములా' పాటలు కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఇక బుట్ట బొమ్మ పాట అయితే ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది.

షూటింగ్ నిబంధనలు.. వ్యాక్సీన్ వేసుకుంటేనే
మళ్లీ చాలా గ్యాప్ తరువాత మేకర్స్ షూటింగ్ లకు సిద్దమవుతున్నారు. ఒకరిద్దరు హీరోలు అప్పుడే షూటింగ్ లను మొదలుపెట్టారు కూడా. అయితే ఇంతకుముందు లాగ పరిస్థితులు లేవు కాబట్టి పూర్తి స్థాయిలో సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా తగ్గిపోలేదు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ లు చేయాల్సిందే. ఇక ఈనేపథ్యంలో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఆద్వర్యంలో సమావేశం జరగగా.. షూటింగ్ లు జరుపుకోడానికి కొన్ని నిబంధనలు విధించారు. వాటిలో పలు కీలక అంశాలను జోడించారు. షూటింగ్ చేసే ప్రొడక్షన్ హౌస్ వారు ఆర్టిస్ట్ ల నుండి టెక్నీషియన్ నుండి వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా డిక్లరేషన్ తీసుకోవాలని నిర్ణయించారు. ఇంకా పలు అంశాలను జోడించారు.

పుష్ప లో సర్ ప్రైజింగ్ గా నా రోల్..!
సినీ పరిశ్రమలోకి ఎంతో మంది హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చినా కొంతమందికి మాత్రమే స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది రష్మిక మందన్న. ప్రస్తుతం రష్మిక సినీ కెరీర్ సూపర్ ఫామ్ లో ఉందని చెప్పొచ్చు. ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరోపక్క తమిళ్, హిందీ లో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ఇక ప్రస్తుతం రష్మిక పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో రష్మిక డీ గ్లామర్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నరష్మిక ఈసినిమాలో తన రోల్ గురించి చెప్పుకొచ్చింది. పుష్ప…

ఫిదా బ్యూటీకి బాలీవుడ్ ఆఫర్..!
సౌత్ సినీ కెరీర్ ప్రారంభించి ఇక్కడ సక్సెస్ అందుకొని నార్త్ కు వెళ్లి అక్కడ సినిమాలు చేస్తూఅక్కడే స్టిక్ అయిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. అక్కడ ఒకటో రెండో సినిమాలు చేసి తరువాత అవకాశాలు రాక సినీ కెరీర్ ను నాశనం చేసుకున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు హీరోయిన్స్ మాత్రం అలా కాకుండా తమ సినీ కెరీర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ సినిమాలు చేస్తూ మరోవైపు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ తమ కెరీర్ కు ఎలాంటి రిస్క్ లేకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పూజాహెగ్డే, రష్మిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో ఉండగా.. మరోవైపు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక…

'దృశ్యం-2' రీమేక్- గౌతమి ప్లేస్ లో మీనా
జీతూజోసఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్ కథానాయకుడిగా తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’ ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. 2013 డిసెంబర్ 19న విడుదలై అప్పట్లో కేరళలో ఇండస్ట్రీ హిట్ గా నిలచింది. ఇక తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మొదలైన భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయగా అన్ని భాషల్లోనూ మంచి విజయం దక్కించుకుంది. ఇక దీనికి సీక్వెల్ గా మలయాళంలో వచ్చిన ”దృశ్యం 2” ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి వ్యూయర్ షిప్ తెచ్చుకుంటోంది. ఇక తెలుగులో కూడా ఈసినిమా సీక్వెల్ వస్తుంది. వెంకీ-మీనా ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈసినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్.

ఉచిత విద్య ,వైద్యం సోనూసూద్ డ్రీమ్
కరోనా లాక్ డౌన్ సమయంలో వేలాది వలస కార్మికులను ఆదుకున్న సోనూసూద్ ఫస్ట్ వేవ్‌తో పోల్చితే సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉండడం తో హాస్పిటల్స్‌లో బెడ్స్, ఆక్సీజన్ దొరకక అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని ఆక్సీజన్ ప్లాంట్‌లను నెలకొల్పాలనే కీలక నిర్ణయం సోనూసూద్ తీసుకున్నారు.

కీర్తి సురేష్ బ్లాక్ &వైట్ ఫొటో
కీర్తి సురేష్ కొన్ని మలయాళ మూవీస్ లో బాలనటిగా నటించారు. “గీతాంజలి “మూవీ తో కీర్తి కథానాయికగా మారారు. “ఇదు ఎన్న మాయం ” మూవీ తో కోలీవుడ్ ,”నేను శైలజ ” మూవీ తో టాలీవుడ్ కు కీర్తి కథానాయికగా పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “అన్నాత్తే” , “సాని కాయిదం “(తమిళ ), “వాశి ” మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

టాలీవుడ్ 'మిషన్ ఇంపాజిబుల్'లో తాప్సీ
“ఝుమ్మంది నాదం”మూవీ తో టాలీవుడ్ కు “ఆడుకాలం” మూవీ తో కోలీవుడ్ కు తాప్సీ పన్ను పరిచయం అయ్యారు. సూపర్ హిట్ “చష్మే బద్దూర్ “మూవీ తో బాలీవుడ్ లో తాప్సీ అడుగుపెట్టారు. తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన తాప్సీ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ పై ఫోకస్ పెట్టి బాలీవుడ్‌లో “పింక్”, “బద్లా”, “థప్పడ్”, “నామ్ షబానా”, “సాండ్ కీ ఆంఖ్”, “మిషన్ మంగళ్” వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షలను అలరించారు.