టిడిపి ఎంపి గల్లా జయదేవ్, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరో గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మేజర్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా టైటిల్ టీజర్‌ను జూన్ 23న లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ విషయాన్నీ ప్రకటిస్తూ మేకర్స్ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈపోస్టర్ లో అశోక్ లుక్ చూస్తుంటే… మహేష్ ‘టక్కరి దొంగ’ లుక్ గుర్తుకు వస్తోంది. సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా ఈసినిమా టైటిల్ ను టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
Can’t wait to share with you guys the teaser! #ProductionNo1 teaser will be out on 23 June🥳#ProductionNo1Title@SriramAdittya #PadmavathiGalla @AgerwalNidhhi @JayGalla @ravipatic #SameerReddy @GhibranOfficial @amararajaent pic.twitter.com/Hhng3NFq0z
— Ashok Galla (@AshokGalla_) June 20, 2021
కాగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో జగపతి బాబు, నరేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గల్లా జయదేవ్ సొంత ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందిస్తున్నారు. మరి ఇప్పటికే కృష్ణ ఫ్యామిలీ నుండి మహేష్ బాబు, సుధీర్ బాబు, మంజుల ఇండస్ట్రీలో తమ కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. మరి అశోక్ ఏ మేరకు తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తాడో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: