జీతూజోసఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్ కథానాయకుడిగా తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’ ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. 2013 డిసెంబర్ 19న విడుదలై అప్పట్లో కేరళలో ఇండస్ట్రీ హిట్ గా నిలచింది. ఇక తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మొదలైన భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయగా అన్ని భాషల్లోనూ మంచి విజయం దక్కించుకుంది. ఇక దీనికి సీక్వెల్ గా మలయాళంలో వచ్చిన ”దృశ్యం 2” ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి వ్యూయర్ షిప్ తెచ్చుకుంటోంది. ఇక తెలుగులో కూడా ఈసినిమా సీక్వెల్ వస్తుంది. వెంకీ-మీనా ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈసినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు తమిళ్ లో సీక్వెల్ మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. తమిళ దృశ్యంలో విశ్వనటుడు కమల్‌హాసన్ నటించగా, ఆయన భార్యగా గౌతమి నటించారు. ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు నిర్మాతలు ముందుకు రాగా, అందులో నటించేందుకు హీరో కమల్‌హాసన్ అంగీకరించారు. అయితే, హీరోయిన్‌గా మాత్రం గౌతమిని తీసుకోవడంలేదన్న వార్తలు వస్తున్నాయి. హీరోయిన్‌గా మీనాను ఎంపిక చేయాలని చిత్ర దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలుగులో నటిస్తున్న మీనా తమిళ్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































