సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ కథానాయిక. దుబాయ్ లో ఒక షూటింగ్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ రెండవ షెడ్యూల్ ప్రారంభం అయిన వెంటనే కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో #SSMB 28 ” మూవీ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.#SSMB 28 ” మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వరస సూపర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో దూసుకుపోతున్న మహేష్ బాబు కు అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో కూడా మహేష్ బాబు కు ఫాలోవర్స్ అధికమే. ఆగస్ట్ 9 వ తేదీ తమ అభిమాన మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా అభిమానులు సెలబ్రేషన్స్ ప్రారంభించారు. తాజాగా మహేష్ పుట్టినరోజుకు 50డేస్ ఉందంటూసీడీపీ రిలీజ్ చేశారు. “స్టే హోమ్ స్టే సేఫ్” అంటూ అడ్వాన్స్ బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్టర్ సీడీపీ రిలీజ్ చేశారు. ఆ సీడీపీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: