టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల మధ్య ఎంత పోటీ ఉంటుందో తెలుసు.. కానీ ఎంత పోటీ ఉన్నా ఒకరికొకరు మాత్రం సపోర్ట్ చేసుకుంటూనే ఉంటారు… సన్నిహితంగా ఉంటారు. అలానే దర్శకులు కూడా. ఇండస్ట్రీలో దర్శకుల మధ్య హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది. ఎవరు హిట్స్ ఇచ్చినా కూడా వెంటనే మరొకరు ఫోన్ చేసి విష్ చేస్తుంటారు. గతంలో టాప్ డైరెక్టర్స్ అందరూ కలిసి పార్టీలు చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఒక్కసారి మాత్రమే కాదు వీలు దొరికిన ప్రతీసారి రెగ్యులర్‌గా పార్టీలు చేసుకుంటూనే ఉంటారు మన దర్శకులు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈ గతంలో సంప్రదాయాన్ని యంగ్ డైరెక్టర్స్ కూడా పాటిస్తున్నారు. గతంలో టాలీవుడ్ లో ఉన్న అగ్ర దర్శకులంతా కలిసి ఓ చోట చేరి పార్టీ చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు యంగ్ హీరోస్ అంతా కలిసి ఒక చోట ఒకే ఫ్రేమ్ లో కనిపించగా ఇప్పుడు ఈ ఫొటో అందరినీ ఆకట్టుకుంటుంది.
సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో హిట్ అందుకున్న సుబ్బు, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి, జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్, నన్ను దోచుకుందువటే ఫేమ్ ఆర్ఎస్ నాయుడు, నాని తో మజ్ను తీసిన విరించి వర్మ ఈ ఐదుగురు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ సెల్ఫీ తీసుకున్న ఈ ఫొటో వైరల్ గా మారింది. అంతేకాదు డైరెక్టర్స్ మధ్య ఎంత పోటీ ఉన్నా ఇలా ఫ్రెండ్లీ గా ఉండటం చాలా బావుందంటున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: