
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 31


త్వరలో "టక్ జగదీష్ "రిలీజ్

మెగా ప్రిన్స్ బాలీవుడ్ ఎంట్రీ

14 వసంతాల "లక్ష్యం "

'తాప్సీ' మిషన్ ఇంపాజిబుల్

సాలిడ్ ఫైట్ తో పవన్-రానా షూట్ రీస్టార్ట్

ప్రభాస్ అన్న ఎప్పుడైనా రెడీ

విజయ్ దేవరకొండ లేటెస్ట్ లుక్

ఏపీలో తెరుచుకోనున్న థియేటర్లు

త్వరలో "ఆరడుగుల బుల్లెట్" రిలీజ్

'#D43' జులై నుండి ఫైనల్ షెడ్యూల్

'గుడ్ లక్ సఖి' ఫ్యాన్స్ కు స్పెషల్ షో

షూటింగ్స్ తో పూజాహెగ్డే బిజీ

'వసంత కోకిల' టీజర్ రిలీజ్

శక్తిమంతమైన కథల కై ఎదురుచూస్తున్నా - రాశీఖన్నా

లేడీ ఓరియెంటెడ్ మూవీ లో ప్రియమణి

ఇంగ్లీష్ లో డబ్ అయిన తొలి సౌత్ ఇండియన్ మూవీ

ఫైట్ సీక్వెన్స్ తో "శాకినీ -ఢాకినీ " ప్రారంభం

వినాయక చవితికి "అఖండ "?

శ్రియ కథక్ డ్యాన్స్
కథక్ డ్యాన్సర్ శ్రియశరణ్ “ఇష్టం ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “తుఝే మేరే కసమ్ “మూవీ తో బాలీవుడ్ కు , “ఎనక్కు 20 ఉనక్కు 18 “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ,తెలుగు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శ్రియ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రియ ప్రస్తుతం “గమనం “, “రౌద్రం రణం రుధిరం “మూవీస్ లో నటిస్తున్నారు.

త్వరలో "టక్ జగదీష్ "రిలీజ్
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నేచురుల్ స్టార్ నాని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. జగపతి బాబు , నాజర్ , నరేష్ , రావు రమేష్ , దేవదర్శిని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

మెగా ప్రిన్స్ బాలీవుడ్ ఎంట్రీ
సౌత్ నటీ నటులకు నార్త్ పై ఎప్పుడూ కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ కాస్త ఫేమ్ తెచ్చుకొని బాలీవుడ్ కు వెళ్లిన నటీ నటులు చాలా మంది ఉన్నారు. ఇక హీరోయిన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడా ఇక్కడ సినిమాలు చేస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్ హీరోస్ కూడా చిన్నగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి చూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఇచ్చారు... కొంతమంది ఇస్తున్నారు.. ఇక తాజాగా మరోహీరో కూడా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయినట్టు తెలుస్తుంది. ఆహీరో మరెవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.

14 వసంతాల "లక్ష్యం "
శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ , అనుష్క జంటగా రూపొందిన "లక్ష్యం "మూవీ 2007 సంవత్సరం జూలై 5వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. జగపతి బాబు ఒక కీలక పాత్రలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌కు తోడు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగానే వర్కవుట్ కావడంతో లక్ష్యం సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. హీరో గోపీచంద్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన "లక్ష్యం " మూవీ 14 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది.

'తాప్సీ' మిషన్ ఇంపాజిబుల్
ఝుమ్మంది నాదం చిత్రంతో వెండితెరకి పరిచయమైన తాప్సీ ఆతరువాత పలు గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితమైంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ కు వెళ్లిన తరువాత తాప్సీ సినీ కెరీర్ పూర్తిగా మారిపోయింది. వైవిథ్యమైన కథలను ఎంచుకుంటూ బాలీవుడ్ లో తన సత్తా చాటుతుంది తాప్సీ. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక దీనితో పాటు చాలా గ్యాప్ తరువాత మరోసారి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.

సాలిడ్ ఫైట్ తో పవన్-రానా షూట్ రీస్టార్ట్
రీఎంట్రీ తర్వాత గ్యాప్ లేకుండా సినిమాలు చేయడానికి ఫిక్సయ్యారు పవన్ కళ్యాణ్. ‘వకీల్ సాబ్’ తర్వాత వెంటనే వరుస సినిమాల షూటింగ్ లతో బిజీ అయ్యారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, అలాగే సాగర్ కె చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియనుమ్ సినిమాలు చేస్తుండగా.. రెండు సినిమాలు షూటింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. సెకెండ్ వేవ్ కారణంగా రెండు సినిమాల షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే వీటిలో ముందుగా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’రీమేక్ షూటింగ్ రీస్టార్ట్ అవుతోంది. ఈ నెల 12నండి మొదలయ్యే షెడ్యూల్‌లో ముందుగా ఇంటర్వెల్ సమయంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్‌ని చిత్రీకరించడానికిప్లాన్ చేశారట. పవన్, రానాల మధ్య జరిగే ఈ…

ప్రభాస్ అన్న ఎప్పుడైనా రెడీ
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి1. బాహుబలి2 సిరీస్ లు తెలుగు సినిమా స్థాయిని ఏ రేంజ్ కు తీసుకెళ్లాయే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. పక్క రాష్ట్రాలు.. దేశాల్లో ఉన్న ప్రేక్షుకులను సైతం అలరించి హద్దుల్ని బద్దలు కొట్టేసింది. ఇక ఈ సినిమా ఎన్నో సినిమాలకు స్ఫూర్తి అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలకు బాహుబలి ఒక ఇన్స్పిరేషన్. మరి అలాంటి సినిమా తరువాత ప్రభాస్ చేయబోయే సినిమాపై ఎన్ని అంచనాలు ఉంటాయో తెలియంది కానీ. ముఖ్యంగా డైరెక్టర్ కు ఎంత ప్రెజర్ గా ఉంటుందో తెలిసిందే. అలాంటి ప్రెజర్ ను తట్టుకొని సాహో లాంటి…

విజయ్ దేవరకొండ లేటెస్ట్ లుక్
“పెళ్ళిచూపులు “మూవీ ఘనవిజయం సాధించడంతో విజయ్ దేవరకొండ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ దేవరకొండ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుని క్రేజీ హీరోగా మారారు. సూపర్ హిట్ “గీత గోవిందం “, “టాక్సీవాలా “మూవీస్ తో విజయ్ ప్రేక్షకులను అలరించారు. విజయ్ ప్రస్తుతం తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న “లైగర్ “మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఏపీలో తెరుచుకోనున్న థియేటర్లు
గత ఏడాది కరోనా వల్ల థియేటర్లు మొత్తం మూతపడిన సంగతి తెలిసిందే కదా.. ఈఏడాది ఎలాగోలా ఓపెన్ చేసినా కొద్దిరోజులు మాత్రమే ఆ సందడి సాగింది. మళ్లీ కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఉదృతంగా మారడంతో థియేటర్లు మళ్లీ మూతపడ్డాయి. అయితే లాక్ డౌన్ తీసినా కానీ థియేటర్ల ఓపెన్ చేయకూడదని అనుకున్నా కానీ మళ్లీ ఓపెన్ చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 100 శాతం సిట్టింగ్ కెపాసిటీ తో థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని కోరనా నిబంధనలు ప్రకారం థియేటర్లు ఓపెన్ చేసుకోడానికి అనుమతులు ఇచ్చారు.

త్వరలో "ఆరడుగుల బుల్లెట్" రిలీజ్
జై బాలాజీ రియల్ మీడియా బ్యానర్ పై సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆరడుగుల బుల్లెట్ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రకాష్ రాజ్ ,అభిమన్యు సింగ్ , కోట , బ్రహ్మానందం ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

'#D43' జులై నుండి ఫైనల్ షెడ్యూల్
కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అనేతేడా లేకుండా అన్ని భాషల్లోనూ సినిమా చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు ధనుష్. ఇప్పటికే ధనుష్ నటించిన కర్ణన్, జగమే తంత్రం సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయి సందడి చేశాయి. ఇప్పుడు కార్తిక్ నరేన్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ మొదలై చివరి దశకు కూడా చేరుకుంది. లాక్ డౌన్ లేకపోతే షూటింగ్ పూర్తి చేసుకొని ఉండేది. ఇక ఇప్పుడు అందరూ షూటింగ్ లు మొదలుపెడుతుండటంతో ధనుష్ కూడా రంగంలోకి దిగనున్నాను. ఈసినిమాఫైనల్ షెడ్యూల్ ను జులై నుండి ప్రారంభించనున్నట్టు మేకర్స్ అధికారికంగా తెలిపారు.

'గుడ్ లక్ సఖి' ఫ్యాన్స్ కు స్పెషల్ షో
నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గుడ్ లక్ సఖి. జూన్ 3న భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇక ఇటీవలే ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు రాగా వాటికి క్లారిటీ కూడా ఇచ్చింది చిత్రయూనిట్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఫ్యాన్స్ కు ఒక బంపరాఫర్ ఇచ్చారు మేకర్స్. యాభై మంది అభిమానులను ఎంపిక చేసి వారికి స్పెషల్ షో వేసి ఈ సినిమాను చూపించబోతున్నారట. ఎప్పుడు అభిమనులకు ఈ చిత్రం చూపించబోతున్నారో ఇంకా…

షూటింగ్స్ తో పూజాహెగ్డే బిజీ
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “రాధేశ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “ఆచార్య “మూవీ లో రామ్ చరణ్ కు జంటగా పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మూవీస్ “కభీ ఈద్ కభీ దివాలీ “, “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ కు జోడీగా పూజాహెగ్డే ”బీస్ట్ " తమిళ మూవీ లో ఎంపిక అయినవిషయం తెలిసిందే.

'వసంత కోకిల' టీజర్ రిలీజ్
తమిళ్ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటుల్లో బాబి సింహా కూడా ఒకరు. పలు తమిళ మూవీస్ లో ప్రతినాయకుడిగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో కూాడా పలు సినిమాల్లో నటించాడు. రన్, ఏదైనా జరగొచ్చు, డిస్కో రాజా మూవీస్ లో నటించాడు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో వచ్చేస్తున్నాడు.

శక్తిమంతమైన కథల కై ఎదురుచూస్తున్నా - రాశీఖన్నా
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రాశీఖన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం “థ్యాంక్ యు”, “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 5 తమిళ , ఒక మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితం అయిన రాశీఖన్నా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో తన లేటెస్ట్ ఫోటోషూట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

లేడీ ఓరియెంటెడ్ మూవీ లో ప్రియమణి
"ఎవరే అతగాడు "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రియమణి "కంగలై ఖైదు సేయ్ "మూవీ తో కోలీవుడ్ , "సత్యం "మూవీ తో మలయాళ చిత్రపరిశ్రమకు కథానాయికగా పరిచయం అయ్యారు. "పరుత్తి వీరన్ "తమిళ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఆది సినిమాలో సునీల్ పోస్టర్ రిలీజ్
టాలీవుడ్ లో ఓ వెరైటీ టోన్ తో తన కామెడీ మార్క్ ను చూపించి స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు సునీల్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.. ఎన్నో సినిమాల్లో తన కామెడీతో నవ్వించాడు. అయితే హీరోగా ఎంట్రీ ఇవ్వకపోతే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తరువాత మాత్రం ఒకటి రెండు హిట్స్ అందుకున్నా ఆతరువాత మాత్రం వరుస పరాజయాలే అందుకున్నాడు. ఇప్పుడిప్పుడే మళ్లీ అవకశాలు అందుకుంటున్నాడు. హీరో, కమెడీ పాత్రలతో పాటు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.

ఇంగ్లీష్ లో డబ్ అయిన తొలి సౌత్ ఇండియన్ మూవీ
రమా ఫిల్మ్స్ బ్యానర్ పై కె మురళీమోహనరావు దర్శకత్వంలో చిరంజీవి , సోనమ్ , రాధ, మోహన్ బాబు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన వెస్ట్రన్ యాక్షన్ ఫిల్మ్ "కొదమసింహం " మూవీ 1990 సంవత్సరం ఆగస్ట్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో చిరంజీవి కౌబాయ్ , మోహన్ బాబు కామెడీ విలన్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిరంజీవి , మోహన్ బాబు ల మధ్య సీన్స్ ప్రేక్షకులను అలరించాయి .

ఫైట్ సీక్వెన్స్ తో "శాకినీ -ఢాకినీ " ప్రారంభం
సురేష్ ప్రొడక్షన్స్ , గురు ఫిల్మ్స్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా ప్రధాన పాత్రలో "శాకినీ -ఢాకినీ " మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ కొరియన్ మూవీ “మిడ్ నైట్ రన్నర్స్ “కు తెలుగు రీమేక్ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లో టాలెంటెడ్ యాక్ట్రెస్ నివేద థామస్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

వినాయక చవితికి "అఖండ "?
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన" అఖండ" టైటిల్ పోస్టర్, టైటిల్ రోర్ పేరుతో రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.