యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు వెంకీ. జీతూ జోసఫ్ దర్శకత్వంలో వెంకీ ప్రధాన పాత్రలో దృశ్యం రీమేక్ దృశ్యం 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా అలా మొదలుపెట్టాడో లేదో అప్పుడే షూటింగ్ ను పూర్తి చేసేశాడు. ఇక ఈసినిమా కంటే ముందే శ్రీకాంత్ అడ్డాలతో నారప్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ హీరోగా తమిళ్ లో సూపర్ హిట్అయిన అసురన్ సినిమాకు రీమేక్ ఈసినిమా. ఇక ఈ సినిమా విషయంలో వెంకీ చాలా కేర్ తీసుకుంటున్నాడని… అనంతపురం యాస అన్ని పర్‌ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటున్నాడని వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారంఈ సినిమా, ఫస్ట్ కాపీ రెడీ అవుతోందట. ఒక వారం రోజుల్లో ఫస్టుకాపీ వచ్చేస్తుందని అంటున్నారు. ఇక ఎప్పుడు విడుదల చేయనున్నారనేది త్వరలోనే ప్రకటిస్తారట. అందుకు సంబంధించిన చర్చలు నడుస్తున్నాయని చెబుతున్నారు. ఈ సినిమా తప్పకుండా ఆయన కెరియర్లో వైవిధ్యభరితమైన చిత్రంగా నిలుస్తుందని అంటున్నారు.
కాగా ప్రియమణి ఈ సినిమాలో సుందరమ్మగా నటిస్తుంది. కేరాఫ్ కంచరపాలెం ఫేం కార్తీక్ రత్నం కీలక పాత్రలో నటిస్తున్నాడు. నారప్ప పెద్ద కొడుకు మునికన్నా పాత్రలో కార్తీక్ రత్నం నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఈరెండు సినిమాలతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమా రీమేక్ చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా కరోనా వల్ల బ్రేక్ పడింది. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: