మళ్లీ చాలా గ్యాప్ తరువాత మేకర్స్ షూటింగ్ లకు సిద్దమవుతున్నారు. ఒకరిద్దరు హీరోలు అప్పుడే షూటింగ్ లను మొదలుపెట్టారు కూడా. అయితే ఇంతకుముందు లాగ పరిస్థితులు లేవు కాబట్టి పూర్తి స్థాయిలో సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా తగ్గిపోలేదు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ లు చేయాల్సిందే. ఇక ఈనేపథ్యంలో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఆద్వర్యంలో సమావేశం జరగగా.. షూటింగ్ లు జరుపుకోడానికి కొన్ని నిబంధనలు విధించారు. వాటిలో పలు కీలక అంశాలను జోడించారు. షూటింగ్ చేసే ప్రొడక్షన్ హౌస్ వారు ఆర్టిస్ట్ ల నుండి టెక్నీషియన్ నుండి వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా డిక్లరేషన్ తీసుకోవాలని నిర్ణయించారు. ఇంకా పలు అంశాలను జోడించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
* ప్రభుత్వం వారు ఎప్పటికప్పుడు ఇస్తున్న మార్గదర్శకాలు (SOPs) విధిగా పాటించవలసిన దిగా నిర్ణయించడం అయినది. ఈ సూచనలు అన్నిటిని ప్రొడక్షన్ హౌస్ మేనేజర్స్, ఆర్టిస్ట్ మేనేజర్స్ కి తెలియ చేస్తూ వారు ఆయా టెక్నీషియన్ కు ఆయా ఆర్టిస్ట్ లకు తెలియ చేయవలసిన బాధ్యత వారిదే అని తీర్మానించడమైనది.
* అలాగే ప్రతి ఒక్క టెక్నీషియన్, ఆర్టిస్ట్ వ్యక్తిగతంగాను, వ్యవస్థ పరంగానూ అందరు సామాజిక బాధ్యత తో మెలుగుతూ తగు జాగ్రత్తలు తీసుకొంటూ షూటింగ్స్ లలో పాల్గొనాలని కోరడమైనది
* అలాగే ఫిలిం ఇండస్ట్రీ లోని ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ ఖచ్చితంగా తీసుకోవాలని సూచించడం అయినది
* పైన తెలియజేసిన తీర్మానాలను తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ వారు తమ సమ్మతిని తెలియచేసినారు.
* ఈ విషయాలకు సంబంధించి సలహాలు గాని, ఫిర్యాదులు గాని, ఏమైనా ఉన్న యెడల లేదా వీటిని పాటించని యెడల తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారికి వెంటనే తెలియ జేసిన యెడల, ఆ ప్రకారం వారు తగు చర్యలను తీసుకొని వాటిని అమలు చేయుటకు నిర్ణయించడం అయినది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: