
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 20


"మాచర్ల నియోజకవర్గం" లో మరో కథానాయికగా కేథరిన్?

'నాట్యం' రిలీజ్ డేట్ ఫిక్స్

25 సంవత్సరాల తరువాత "ప్రేమదేశం" సీక్వెల్

"డేగల బాబ్జీ" ఫస్ట్ లుక్ రిలీజ్

'హనుమాన్' ఫస్ట్ లుక్ రిలీజ్

'ఎఫ్ 3' షూటింగ్ రీస్టార్ట్

'దృశ్యం' కు తగ్గని క్రేజ్ మరో భాషలో రీమేక్

మేఘ ఆకాష్ 3 మిలియన్ సెలబ్రేషన్స్

ఉమెన్ సెంట్రిక్ మూవీ లో అనసూయ

రకుల్ ప్రీత్ కొత్త యోగాసనం

జర్మన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు 'కర్ణన్'

సౌందర్య బయోపిక్ లో నటించాలని ఉంది -రష్మిక

'ఎఫ్3' షూటింగ్ అప్ డేట్

టాలీవుడ్ లో బిజీగా ధనుష్

రాశీఖన్నా ప్లెజెంట్ లుక్

కొత్త సినిమాకి సమంత గ్రీన్ సిగ్నల్
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”, “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. “శాకుంతలం ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన సమంత తన ఫ్రెండ్స్ తో హాలీడే ట్రిప్ కు గోవా వెళ్ళి ఎంజాయ్ చేశారు. సమంత ఇప్పుడు ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

"మాచర్ల నియోజకవర్గం" లో మరో కథానాయికగా కేథరిన్?
శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్,బ్లాక్ బస్టర్ "ఉప్పెన"మూవీ ఫేమ్ కృతిశెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీ లో విలన్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ గా ఉండనుందనీ , విలన్ గా సముద్ర ఖని నటించనున్నారనీ సమాచారం. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు.

'నాట్యం' రిలీజ్ డేట్ ఫిక్స్
రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యరాజు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా 'నాట్యం'. ఇక ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. అక్టోబర్ 22, న ప్రపంచవ్యాప్తంగా విడుదలచేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

25 సంవత్సరాల తరువాత "ప్రేమదేశం" సీక్వెల్
జెంటిల్‌మెన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కదిర్ దర్శకత్వంలో వినీత్, అబ్బాస్, టబు ప్రధానపాత్రలలో నటించిన "కాదల్ దేశం " తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ "ప్రేమ దేశం " మూవీ 1996 సంవత్సరం లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూత లూగించాయి. 25 సంవత్సరాల తరువాత "ప్రేమదేశం" సీక్వెల్ తెరకెక్కనుంది.

"డేగల బాబ్జీ" ఫస్ట్ లుక్ రిలీజ్
"వినోదం "మూవీ తో కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ పలు సూపర్ హిట్ మూవీస్ లో కమెడియన్ గా ప్రేక్షకులను అలరించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ , రవితేజ వంటి స్టార్ హీరోస్ తో మూవీస్ నిర్మించారు. బండ్ల గణేష్ ఇప్పుడు హీరో గా ప్రేక్షకులను అలరించనున్నారు.

'హనుమాన్' ఫస్ట్ లుక్ రిలీజ్
తెలుగులో రొటీన్‌కు భిన్నంగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఫస్ట్ మూవీ ‘అ’ తోనే అందరి ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ మొదటి సినిమాతోనే జాతీయ అవార్డును సైతం అందుకున్నాడు. ఇక ఇటీవల కరోనా నేపథ్యంలో తేజ సజ్జాను హీరోగా పరిచయం చేస్తూ జాంబి రెడ్డి సినిమాను తెరకెక్కించి మొదటిసారి తెలుగు తెరపై జాంబీస్ ను పరిచయం చేశాడు. ఇక ఈసినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి తేజ తోనే సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో మరో కొత్త జోనర్ తో వస్తున్నాడు.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' డబ్బింగ్ మొదలుపెట్టిన పూజా
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఇక అందరూ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అయిపోతుంటే.. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న అఖిల్ కూడా ఫైనల్లీ తన సినిమాతో రావడానికి సిద్దమవుతున్నాడు. నిజానికి ఈసినిమా రిలీజ్ కు చాలా ఆలస్యం అయిందనే చెప్పాలి. కరోనా ప్రభావం తగ్గిన తరువాత అయినా త్వరగా రిలీజ్ చేస్తారు అనుకున్నారు కానీ ఎందుకో అదీ కూడా కుదరలేదు. ఫైనల్ గా అక్టోబర్ 8న సినిమా రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇక ఇప్పటికే ఈసినిమాలు పలు పోస్టర్లు, టీజర్, పాటలు లాంటివి రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్సే సొంతం…

'ఎఫ్ 3' షూటింగ్ రీస్టార్ట్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన 'ఎఫ్ 2' సినిమా ఎంత సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే కదా. ఇక అప్పుడే ఆ సినిమాకి సీక్వెల్ గా 'ఎఫ్ 3' చేస్తున్నట్టు ప్రకటించేశారు. ఇక చెప్పినట్టే ఈసినిమా సీక్వెల్ ను మొదలుపెట్టారు. అయితే కొంతవరకూ షూటింగ్ ను జరిపిన తరువాత కరోనా కారణంగా ఈసినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇక చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు.

'దృశ్యం' కు తగ్గని క్రేజ్ మరో భాషలో రీమేక్
దృశ్యం.. ఈసినిమాకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈసినిమా సంచలన విజయం సాధించింది. ఇక అదే క్రేజ్ తో తెలుగుతో పాటు పలు భాషల్లో కూడా తెరకెక్కించారు. అయితే అన్ని భాషల్లోనూ ఈసినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా ఈసినిమాకు సీక్వెల్ ను తీయగా అది కూడా ఎంత విజయాన్ని దక్కించుకుందో తెలుసు. ఇక తెలుగులో కూడా ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ దృశ్యం 2 ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది.

మేఘ ఆకాష్ 3 మిలియన్ సెలబ్రేషన్స్
“లై “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మేఘ ఆకాష్ , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.”ఛల్ మోహన్ రంగ “మూవీ లో కథానాయికగా నటించిన మేఘ రజనీకాంత్ “పేట ” మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. “శాటిలైట్ శంకర్ ” మూవీ తో మేఘ బాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. రీసెంట్ గా "రాజ రాజ చోర ", "డియర్ మేఘ" మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. మేఘ ప్రస్తుతం తెలుగులో“గుర్తుందా శీతాకాలం”, “మనుచరిత్ర” తెలుగు మూవీస్, తమిళ భాషలో రెండు మూవీస్ లో నటిస్తున్నారు.

ఉమెన్ సెంట్రిక్ మూవీ లో అనసూయ
బుల్లితెర పై సక్సెస్ ఫుల్ యాంకర్ గా రాణిస్తూ బ్లాక్ బస్టర్ “రంగస్థలం“మూవీ లో రంగమ్మత్త గా ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “పుష్ప“, “రంగమార్తాండ “, “ఖిలాడి “,మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఒక ఆంథాలజీ మూవీకి అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న "గాడ్ ఫాదర్ "మూవీ లో అనసూయ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. ఇప్పుడు అనసూయ ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీ లో హీరోయిన్ గా ఆఫర్ అందుకున్నారు.

రకుల్ ప్రీత్ కొత్త యోగాసనం
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు ప్రాజెక్ట్స్ తో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా రూపొందిన “కొండ పొలం” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా “డాక్టర్ జీ”, జాన్ అబ్రహాం “ఎటాక్, అజయ్ దేవగన్ “మేడే”, “థ్యాంక్ గాడ్”( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్, ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు.సూపర్ హిట్ “రాక్షసన్ “తమిళ మూవీ హిందీ రీమేక్ “మిషన్ సిండ్రెల్లా “మూవీ కి రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా మరో రెండు భారీ ప్రాజెక్ట్ లకు రకుల్…

జర్మన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు 'కర్ణన్'
తమిళ్ లో ఉన్న హీరోల్లో కాస్త వైవిధ్యంగా సినిమాలు చేసే హీరోలు ఎవరంటే అందులో ధనుష్ పేరు ఖచ్చితంగా ముందు ఉంటుంది. రజినీ కాంత్ అల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా కూడా తన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉండగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా వచ్చిన సినిమా కర్ణన్. గత ఏప్రిల్ లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈసినిమా సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాదు.. విమర్శకులు ప్రశంసలు కూడా దక్కించుకుంది. బాక్సాపీస్ వద్ద రికార్డులు క్రియేట్…

సౌందర్య బయోపిక్ లో నటించాలని ఉంది -రష్మిక
బ్లాక్ బస్టర్ "కిరిక్ పార్టీ " మూవీ తో కన్నడ ప్రేక్షకులను , బ్లాక్ బస్టర్ "ఛలో"మూవీ తో తెలుగు ప్రేక్షకులను , సూపర్ హిట్ "సుల్తాన్ "మూవీ తో తమిళ ప్రేక్షకులను తన అందం , అభినయం తో అలరించిన కూర్గ్ బ్యూటీ రష్మిక శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ”, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించనున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

సాయి పల్లవి వద్ద డ్యాన్స్ నేర్చుకున్నా -నాగచైతన్య
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన “లవ్ స్టోరీ” సెప్టెంబర్ 24 వ తేదీ భారీ అంచనాలతో , భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. “లవ్ స్టోరీ “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ , సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ట్రైలర్ కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. తాజాగా “లవ్ స్టోరి” మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

'ఎఫ్3' షూటింగ్ అప్ డేట్
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్2'. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా సీక్వెల్ గా అనిల్ రావిపూడి ఎఫ్3 సినిమా చేస్తున్నాడు. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది. కానీ కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ ను అక్టోబర్ నుండి మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకూ సగానికి పైగా షూటింగ్ ను పూర్తిచేసుకోగా మిగిలిన భాగాన్ని ఒకే షెడ్యూల్ లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొదట మైసూర్ లో…

"మాచర్ల నియోజక వర్గం "లో సముద్ర ఖని ద్విపాత్రాభినయం ?
పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ లో నటించిన సముద్రఖని, పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ ను తెరకెక్కించారు. “నాలో “, శంభో శివశంభో “, “జెండాపై కపిరాజు “మూవీస్ తో సముద్రఖని దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. “అల .. వైకుంఠపురము లో ..”,”క్రాక్” మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సముద్రఖని టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారారు. పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న సముద్రఖని ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం “, సర్కారు వారి పాట” తెలుగు మూవీస్ తో పాటు 6 తమిళ , ఒక మలయాళ మూవీ లో నటిస్తున్నారు. సముద్ర ఖని విలన్ గా పలు టాలీవుడ్ మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

టాలీవుడ్ లో బిజీగా ధనుష్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ధనుష్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. పలు సూపర్ హిట్ డబ్బింగ్ మూవీస్ ద్వారా ధనుష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. హీరో ధనుష్ ప్రస్థుహం ఒక , హిందీ , ఒక ఇంగ్లీష్ , రెండు తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. "ఆడుకాలం" , "అసురన్" మూవీస్ కు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. ధనుష్ నటుడే కాకుండా నిర్మాత , దర్శకుడు , స్క్రీన్ రైటర్ , సింగర్ , లిరిసిస్ట్ కూడా. టాలెంటెడ్ హీరో ధనుష్ ఇప్పుడు కథానాయకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

ఎన్టీఆర్-కొరటాల సినిమా.. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో లాంచ్..!
ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ లో రెండో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రకటన కూడా ఎప్పుడో వచ్చింది. ప్రస్తుతం కొరటాల శివ ‘ఆచార్య’ పనులను వేగంగా పూర్తి చేస్తున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ని పూర్తి చేసి ఫ్రీగా ఉన్నాడు. అయితే ఇంతవరకూ ఈసినిమా సెట్స్ పైకి మాత్రం రాలేదు. దానికి తోడు కరోనా కూడా రావడంతో ఈసినిమా ప్రారంభానికి ఇంకా లేట్ అయింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా లాంచ్ కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షెడ్యూల్ మొదలు పెట్టాలనే…

రాశీఖన్నా ప్లెజెంట్ లుక్
సూపర్ హిట్ "మనం "మూవీ లో అతిధి పాత్రలో టాలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా సక్సెస్ ఫుల్ "ఊహలు గుస గుసలాడే" మూవీ తో కథానాయికగా మారారు. పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో రాశీఖన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. రాశీఖన్నా తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. నాగచైతన్య “థ్యాంక్ యు”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు “అరణ్మణై 3”, “తుగ్లక్ దర్బార్”, “సర్దార్”, “మేధావి”, “సైతాన్ కా బచ్చా”(తమిళ ) ‘భ్రమమ్’ (మలయాళ) మూవీస్ లో రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు.