తెలుగులో రొటీన్‌కు భిన్నంగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఫస్ట్ మూవీ ‘అ’ తోనే అందరి ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ మొదటి సినిమాతోనే జాతీయ అవార్డును సైతం అందుకున్నాడు. ఇక ఇటీవల కరోనా నేపథ్యంలో తేజ సజ్జాను హీరోగా పరిచయం చేస్తూ జాంబి రెడ్డి సినిమాను తెరకెక్కించి మొదటిసారి తెలుగు తెరపై జాంబీస్ ను పరిచయం చేశాడు. ఇక ఈసినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి తేజ తోనే సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో మరో కొత్త జోనర్ తో వస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఇక తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ లుక్ అందరినీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతుంది.
Here it is.. 😊
Introducing @tejasajja123 as #Hanumanthu from the world of #Anjanadri🏔
Launched by @dulQuer💥
HANU🔶MAN
The First Pan-India SuperHero Film#HanuMan @Niran_Reddy @Primeshowtweets— Prasanth Varma (@PrasanthVarma) September 18, 2021
కాగా `హనుమాన్` ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరో క్యారెక్టర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. తెలుగుతో పాటు ఈసినిమాను పలు భాషల్లో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: