జర్మన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కు ‘కర్ణన్‌’

Dhanush Starrer Karnan Goes To German Film Festival,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Karnan Goes To German Film Festival,Dhanush,Actor Dhanush,Hero Dhanush,Dhanush Movies,Dhanush New Movie,Dhanush Latest Movie,Dhanush Upcoming Movie,Dhanush New Movie Update,Dhanush Latest Movie Update,Dhanush Latest Film Update,Dhanush Karnan,Dhanush Karnan Movie,Dhanush Karnan Movie Update,Dhanush Karnan Movie Latest Update,Dhanush Karnan German Film Festival,Karnan German Film Festival,Karnan,Karnan Movie,Karnan Movie News,Karnan Movie Update,Karnan Movie Latest Update,Karnan Movie Updates,Karnan Latest Updates,Karnan Film Update,Dhanush’s Film Karnan Gets Special Honour At Film Festival In Frankfurt,Karnan Gets Special Honour At German Film Festival,Independent Indian Film Festival,Frankfurt,Independent Indian Film Festival Frankfurt,Karnan Selected For New Generations,Karnan Movie For The New Generations,Karnan Movie Awards,Karnan Full Movie,Dhanush Latest News,Dhanush Movie,Karnan Is To Be Screened At The New Generations,Karnan Selected For New Generations,Karnan New Generations,New Generations Independent Indian Film Festival,#Karnan

తమిళ్ లో ఉన్న హీరోల్లో కాస్త వైవిధ్యంగా సినిమాలు చేసే హీరోలు ఎవరంటే అందులో ధనుష్ పేరు ఖచ్చితంగా ముందు ఉంటుంది. రజినీ కాంత్ అల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా కూడా తన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉండగా మారి సెల్వ‌రాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ హీరోగా వచ్చిన సినిమా క‌ర్ణ‌న్‌. గత ఏప్రిల్ లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ఈసినిమా సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాదు.. విమర్శకులు ప్రశంసలు కూడా దక్కించుకుంది. బాక్సాపీస్ వ‌ద్ద రికార్డులు క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈసినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ‘కర్ణన్‌’ చిత్రం జర్మన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఎంపికైంది. వచ్చే నెల 12 నుంచి 14వ తేదీల మధ్య జర్మన్‌లోని ఫ్రాంక్‌ఫర్ట్‌ నగరంలో జరిగే న్యూ జనరేషన్‌ ఇండిపెండెంట్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఇక ‘కర్ణన్‌’ సినిమా జర్మన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఎంపిక కావడంతో నిర్మాత కలైపులి ఎస్‌.థాను ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం కార్తిక్ నరేన్ దర్శకత్వంలో ధనుష్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. మాళవికా మోహనన్ హీరోయిన్ గా ఈసినిమాలో నటించనుండగా.. స్మృతి వెంకట్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాతో పాటు మిత్రన్ జవహర్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో నిత్యా మీనన్, రాశి ఖన్నా, ప్రియా. బి శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాకు తిరుచిత్రంబలం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here