టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”, “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. “శాకుంతలం ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన సమంత తన ఫ్రెండ్స్ తో హాలీడే ట్రిప్ కు గోవా వెళ్ళి ఎంజాయ్ చేశారు. సమంత ఇప్పుడు ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై నూతన దర్శకుడి దర్శకత్వంలో సమంత కథానాయికగా ఒక థ్రిల్లర్ మూవీ తెరకెక్కనుంది. వివాహం తరువాత ఉమెన్ సెంట్రిక్ సినిమాలు మాత్రమే చేస్తున్న సమంత ఇప్పుడు కొత్త సినిమాకు ఓకే చెప్పారంటే అది కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రమే అనడంలో సందేహం లేదు. సూపర్ హిట్ “ఆదిత్య 369”, “జెంటిల్ మన్”, “సమ్మోహనం” వంటి మూవీస్ ను నిర్మించిన శ్రీ దేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: