బ్లాక్ బస్టర్ “కిరిక్ పార్టీ ” మూవీ తో కన్నడ ప్రేక్షకులను , బ్లాక్ బస్టర్ “ఛలో”మూవీ తో తెలుగు ప్రేక్షకులను , సూపర్ హిట్ “సుల్తాన్ “మూవీ తో తమిళ ప్రేక్షకులను తన అందం , అభినయం తో అలరించిన కూర్గ్ బ్యూటీ రష్మిక శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ”, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించనున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దక్షిణాది భాషలతో పాటు హిందీ భాష లో కూడా పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం అభినయం తో సౌందర్య ప్రేక్షకులను అలరించారు. 12 సంవత్సరాల కెరీర్ లో సౌందర్య 100 మూవీస్ లో నటించడం విశేషం. బెస్ట్ యాక్ట్రెస్ గా సౌందర్య పలు అవార్డ్స్ అందుకున్నారు. సౌందర్యను లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి తో ప్రేక్షకులు పోల్చిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్ లో ఉండగా సౌందర్య 2004 సంవత్సరం లో ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ లో కన్ను మూయడం బాధాకరం. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో సౌందర్య బయోపిక్ మూవీలో నటించాలని ఉందనే తన కోరికను రష్మిక వెల్లడించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: