
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 19


స్టార్ హీరోయిన్ కావాలని ఆశ - ప్రగ్య జైశ్వాల్

"తలైవి " మూవీ కి సీక్వెల్

చిరంజీవి కి జోడీగా మరోసారి తమన్నా ?

హిందీ వెబ్ సిరీస్ లో రెజీనా

వెబ్ సిరీస్ కు రెడీ - సాయి పల్లవి

సరైన కథలను ఎంచుకోలేకపోయా..!

'రాధేశ్యామ్' రూమర్స్ పై మేకర్స్ క్లారిటీ..!

అక్టోబర్ లో సెట్స్ పైకి 'చంద్రముఖి2'

కళ్యాణ్ రామ్ "బింబిసార 1" దీపావళి కి రిలీజ్ ?

ఆ జోనర్ లో చేయడం చాలా కష్టం

సరదా సరదాగా సమంత

2021 సంవత్సరం లో నితిన్ రికార్డ్

ధనుష్ తో థ్రిల్లర్ చేస్తున్నా

"పొన్నియిన్ సెల్వన్ "షూటింగ్ పూర్తి

సందీప్ కిషన్ న్యూ మూవీ ప్రారంభం

మూడు గెటప్పుల్లో బాలకృష్ణ..!
'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న మూడో సినిమా అఖండ. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో పడ్డారు మేకర్స్. ఇప్పటివరకూ టాకీ పార్ట్ మొత్తం పూర్తిచేసుకోగా ప్రస్తుతం గోవాలో పాటల చిత్రీకరణలో ఉన్నారు. ఇక ఈషెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవనున్నట్టు తెలుస్తుంది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

స్టార్ హీరోయిన్ కావాలని ఆశ - ప్రగ్య జైశ్వాల్
తెలుగు ,తమిళ భాషల “విరాట్టు “మూవీ తో మోడల్ ప్రగ్య జైస్వాల్ టాలీవుడ్ , కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు.“కంచె “, “గుంటూరోడు “, “జయ జానకి నాయక “వంటి మూవీస్ లో ప్రగ్య జైస్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “కురుక్షేత్ర ” మూవీ తో కన్నడ చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. బాలీవుడ్ మూవీ “అంతిమ్ :ది ఫైనల్ ట్రూత్ ” లో ప్రగ్య కథానాయికగా నటిస్తున్నారు. ఎన్ని మూవీస్ లో నటించినా ప్రగ్య స్టార్ డమ్ అందుకోలేకపోయారు.

"తలైవి " మూవీ కి సీక్వెల్
విబ్రి మీడియా , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి , లెజెండరీ యాక్ట్రెస్ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ “తలైవి “మూవీ తెలుగు , తమిళ , హిందీ భాషలలో వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 వ తేదీ రిలీజ్ ఆయ్యి ప్రేక్షకాదరణ పొందింది. జయలలిత రియల్ , రీల్ లైఫ్ ముఖ్య సంఘటనలతో తెరకెక్కిన “తలైవి ” మూవీ లో జయలలితగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ , ఎమ్ జి ఆర్ పాత్రలో అరవింద్ స్వామి , కరుణానిధిగా ప్రకాష్ రాజ్ , జానకి రామచంద్రన్ పాత్రలో మధుబాల,శశికళ పాత్రలో పూర్ణ, జయలలిత మదర్ సంధ్య పాత్రలో భాగ్యశ్రీ నటించారు.

చిరంజీవి కి జోడీగా మరోసారి తమన్నా ?
మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం "గాడ్ ఫాదర్"మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత మెహెర్ రమేష్ దర్శకత్వంలో "భోళా శంకర్", బాబీ దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి హీరో గా తమిళ సూపర్ హిట్ “వేదాళం" మూవీ తెలుగు రీమేక్ “భోళా శంకర్” మూవీ తెరకెక్కనుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ లో చిరంజీవి చెల్లెలు గా మహానటి కీర్తి సురేష్ నటిస్తున్నారు.

'నాయట్టు' తెలుగు రీమేక్ కు ఇంట్రెస్టింగ్ టైటిల్..!
మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇక్కడ రీమేక్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే చాాలా సినిమాలు రీమేక్ అయి రిలీజ్ అవ్వగా.. కొన్ని రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఇక ఇదిలా ఉండగామలయాళంలో ఈ ఏడాది వచ్చిన నయట్టు సినిమా మంచి సూపర్ హిట్ అవ్వగా ఇక ఈసినిమాను కూడా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా హక్కులను అల్లు అరవింద్ సొంతం చేసుకున్న సంగతి కూడా విదితమే..

"లవ్ స్టోరీ "మూవీ పై ప్రభాస్ స్పందన
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన “లవ్ స్టోరీ” సెప్టెంబర్ 24 వ తేదీ భారీ అంచనాలతో , భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. “లవ్ స్టోరీ “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ , సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ట్రైలర్ కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది.

హిందీ వెబ్ సిరీస్ లో రెజీనా
సూపర్ హిట్ "ఫ్యామిలీ మ్యాన్" వెబ్ సిరీస్ ఫేమ్ రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా ఒక హిందీ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, అందాల రాశీఖన్నా , జాతీయ అవార్డ్ గ్రహీత అమోల్ పాలేకర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గోవా, ముంబైలోని పలు ప్రాంతాల్లో అమోల్ పాలేకర్ పై వచ్చే సన్నివేశాలను దర్శకులు చిత్రీకరించారు.

వెబ్ సిరీస్ కు రెడీ - సాయి పల్లవి
బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ సాయిపల్లవి ప్రేక్షకులను అలరిస్తున్నారు.టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన “లవ్ స్టోరీ “ ,”విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా కోల్ కతా నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ షూటింగ్ ను సాయి పల్లవి కంప్లీట్ చేశారు.ఒక తమిళ మూవీ , ఒక కన్నడ మూవీ కి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సరైన కథలను ఎంచుకోలేకపోయా..!
ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో ఒక్కొక్కరికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొంతమంది యాక్షన్ సినిమాలు తీయడంలో ఎక్స్ పర్ట్ లు అయితే కొంతమంది కామెడీ సినిమాలు, అలాగే సెన్సిబుల్ సినిమాలో తీయడంలో ఇంకొందరు ఎక్స్పర్ట్ లు అయి ఉంటారు. ఈనేపథ్యంలో శ్రీనువైట్ల కూడా తన సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒకమార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు తన సినిమాల్లో కామెడీని కూడా అదే రేంజ్ లో పండించగల డైరెక్టర్ శ్రీనువైట్ల. ఈమధ్య కాస్త వెనుకబడ్డాడు కానీ ఒకప్పుడు టాప్ డైరెక్టర్ గా హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు.

'రాధేశ్యామ్' రూమర్స్ పై మేకర్స్ క్లారిటీ..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్. ఇక ఈసినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయిపోయింది.అక్కడక్కడ ఉన్న ప్యాచ్ వర్క్ ను పూర్తి చేస్తున్నారు. అయితే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం కంప్లీట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ అవ్వగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇదిలా ఉండగా రీసెంట్ గా ఈసినిమా గురించి పలు పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ మూవీలో నటిస్తున్న పూజా హెగ్డే, ప్రభాస్‌ల మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే కొన్ని సీన్స్ విడి విడిగా చిత్రీకరించినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఈవార్తలు కాస్త మేకర్స్…

అక్టోబర్ లో సెట్స్ పైకి 'చంద్రముఖి2'
పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజనీ స్టైల్‌కు, జ్యోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తమిళ్ సినిమా అయినా తెలుగులో డబ్ అయి ఇక్కడ రిలీజ్ అవ్వగా ఇక్కడ కూడా సంచలన విజయం దక్కించుకుంది. ఇక ఇప్పుడు చంద్రముఖి సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతున్న సంగతి కూడా తెలిసిందే కదా. అయితే ఈసారి రాఘవ లారెన్స్ ఈసినిమాలో ప్రధాన పాత్రలో నటించనున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి కూడా చాలా రోజులైపోయింది.

కొరియోగ్రాఫర్ రాజు సుందరం దర్శకత్వంలో శర్వానంద్ ?
సెన్సేషనల్ హిట్ "RX 100" మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ "మహాసముద్రం" మూవీ అక్టోబర్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. శ్రీకార్తిక్ దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన "ఒకే ఒక జీవితం"మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. హీరో శర్వానంద్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న "ఆడవాళ్ళు మీకు జోహార్లు "మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హీరో శర్వానంద్ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

కళ్యాణ్ రామ్ "బింబిసార 1" దీపావళి కి రిలీజ్ ?
హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం "బింబిసార"మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. స్పై థ్రిల్లర్ "డెవిల్" మూవీ కి కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఎన్టీఆర్ ఆర్ట్స్ పై వశిష్ఠ్ మల్లిడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా సోషియో ఫాంటసీ "బింబిసార"మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. కేథరిన్ , సంయుక్త మీనన్ కథానాయికలు. సూపర్ హిట్ “గౌతమి పుత్ర శాతకర్ణి” మూవీ ఫేమ్ చిరతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ “బింబిసార ” , ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఆ జోనర్ లో చేయడం చాలా కష్టం
ఏ మాయ చేశావే సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సమంత ఇప్పటివరకూ తన కెరీర్ లో దూసుకుపోతూనే ఉంది. హీరోయిన్ గా మాత్రమే కాకుండా హోస్ట్ గా, బిజినెస్, ఇలా అన్ని రంగాల్లో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకుంది. ఇక కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు డీగ్లామరైజ్ పాత్రల్లో కూడా నటించి మెప్పించింది. అంతేకాదు ఈమధ్య లేడీ ఒరియెంటెడ్ సినిమాలు కూడా చేసి తన సత్తా చూపించింది. ఫ్యామిలీ మ్యాన్ లాంటి వెబ్ సిరీస్ లో కూడా నటించి విమర్శకుల ప్రశంసలతో పాటు ఇటీవల తన నటనకు గాను అవార్డ్ ను సైతం దక్కించుకుంది.

సరదా సరదాగా సమంత
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”, “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. “శాకుంతలం ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన సమంత ఇప్పుడు ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

2021 సంవత్సరం లో నితిన్ రికార్డ్
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలోసోషల్ మెసేజ్ తోతెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతిశెట్టి కథానాయిక. పూజాకార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

ధనుష్ తో థ్రిల్లర్ చేస్తున్నా
కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా లవ్ స్టోరీ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న శేఖర్ కమ్ముల ధనుష్ సినిమా గురించి కూడా మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఇప్పటి వరకూ కూల్ సినిమాలతో అలరించిన శేఖర్ కమ్ముల ధనుష్ తో చేయబోయేది థ్రిల్లర్ మూవీ అని క్లారిటీ ఇచ్చాడు. ఇంకా మల్టీ లింగ్వువల్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నానని, వచ్చే ఏడాది…

"పొన్నియిన్ సెల్వన్ "షూటింగ్ పూర్తి
మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా “పొన్నియిన్ సెల్వన్ “తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయంరవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్ లతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

సందీప్ కిషన్ న్యూ మూవీ ప్రారంభం
"గల్లీ రౌడీ"మూవీ తో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో సందీప్ కిషన్ మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "ఎక్కడికి పోతావు చిన్నవాడా" మూవీ ఫేమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతుంది. "అలా ఎలా" మూవీ ఫేమ్ ఖుషి , కావ్యథాపర్ కథానాయికలు. వెన్నెల కిషోర్, వైవాహర్ష ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శేఖర్‌చంద్ర సంగీతం అందిస్తున్నారు. రాజేష్ దండ నిర్మాత.

స్పీడుమీదున్న 'సందీప్ కిషన్'.. సెట్స్ పైకి సూపర్ న్యాచురల్ థ్రిల్లర్
యంగ్ హీరో సందీప్ కిషన్ మాత్రం సూపర్ స్పీడుమీదున్నాడు. సినిమా హిట్ ఫట్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఒక్క సినిమా రిలీజ్ చేయడానికే హీరోలు ఇబ్బందులు పడుతుంటే సందీప్ కిషన్ మాత్రం ఈ ఏడాది రెండు సినిమాలను రిలీజ్ చేసి వావ్ అనిపించుకున్నాడు. ఏ1 ఎక్స్ ప్రెస్ ఈఏడాది ప్రథమార్థంలో రిలీజ్ కాగా.. తాజాగా గల్లీ రౌడీ సినిమా కూడా రిలీజ్ అయింది. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.