దృశ్యం.. ఈసినిమాకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈసినిమా సంచలన విజయం సాధించింది. ఇక అదే క్రేజ్ తో తెలుగుతో పాటు పలు భాషల్లో కూడా తెరకెక్కించారు. అయితే అన్ని భాషల్లోనూ ఈసినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా ఈసినిమాకు సీక్వెల్ ను తీయగా అది కూడా ఎంత విజయాన్ని దక్కించుకుందో తెలుసు. ఇక తెలుగులో కూడా ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ దృశ్యం 2 ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా దృశ్యం సినిమాకు సూపర్ క్రేజ్ ఉంది. ఇండియన్ లాంగ్వేజేస్‌తోపాటు చైనీస్, శ్రీలంకన్ భాషల్లో విడుదలై మంచి స్పందన సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇండోనేషియా భాషలో కూడా రీమేక్ చేస్తున్నారు. ఇక ఈవిషయాన్ని మేకర్స్ తెలియచేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో అత్యధిక భాషల్లో రీమేక్ అయిన మలయాళ చిత్రంగా దృశ్యం నిలిచింది. ఫాల్కన్ ప్రొడక్షన్ కంపెనీ దృశ్యం ఇండోనేషియన్ రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: