టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శ్రీవిష్ణు ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. తన స్థాయికి తగ్గ రేంజ్ లో మంచి కథలను చేసుకుంటూ వెళ్తున్నాడు శ్రీవిష్ణు. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదీ ఒకటే కథ వంటి వైవిధ్యమైన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం శ్రీవిష్ణు వరుస సినిమాలకు ఓకే చెప్తూ మంచి జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికే హసిత్ గోలి దర్శకత్వంలో ‘రాజ రాజ చోర’ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్న ఈసినిమా చివరి దశకు వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో ‘గాలి సంపత్’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80శాతం కంప్లీట్ చేసాడు.
ప్రదీప్ వర్మ డైరెక్షన్ తెరకెక్కుతున్న ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమాకి నారా రోహిత్ క్లాప్ కొట్టి మొదలుపెట్టాడు. శిరీష్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వీటితో పాటు మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. త్వరలోనే వాటిని కూడా అధికారికంగా ప్రకటించనున్నాడట శ్రీవిష్ణు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: