తేజ-వింక్ బ్యూటీ ‘ఇష్క్’

Teja Sajja To Team Up With Wink Beauty Priya Prakash Varrier For His New Movie,Teja Sajja And Priya Prakash Varrier Team Up For A Youthful Film ISHQ,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Priya Prakash Varrier,Priya Prakash Varrier Latest News,Priya Prakash Varrier New Movie News,Teja Sajja,Teja Sajja Latest News,Teja Sajja New Movie News,ISHQ,ISHQ Movie,ISHQ Telugu Movie,ISHQ Movie Latest News,ISHQ Telugu Movie Updates

బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి అప్పుడే అందరిచేత ప్రశంసలు దక్కించుకున్నాడు తేజ. ఇక ఇప్పుడు హీరోగా కూడా సినిమాలు చేసేస్తున్నాడు. ఓ బేబీ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించిన తేజ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘జాంబీ రెడ్డి’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమా మొదలవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తేజ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇష్క్ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ పోస్టర్ ను రిలేస్ చేశారు. “నాట్ ఎ ల‌వ్ స్టోరీ” అనేది ట్యాగ్‌లైన్‌. ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫిలిమ్స్ అందించిన ప్ర‌తిష్ఠాత్మ‌క నిర్మాణ సంస్థ మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ 2021లో త‌న తొలి చిత్రంతో తెలుగులోకి తిరిగి వ‌స్తోంది. య‌స్‌.య‌స్‌. రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఈ చిత్రానికి ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ నిర్మించ‌నున్నారు.

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందిస్తుండగా.. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. శ్రీ‌మ‌ణి పాట‌లు రాస్తున్నారు. ఎ. వ‌ర‌ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా, విఠ‌ల్ కొస‌నం ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియచేయనున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 10 =