‘క్రాక్’ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

Interesting Elements To Watch Out In Ravi Teja Krack Movie,5 Reasons Why Ravi Teja-Shruthi Haasan Starrer Krack Is A Must Watch,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Krack,Krack Movie,Krack Telugu Movie,Ravi Teja,Shruthi Haasan,Krack Movie Updates,Krack Telugu Movie Latest News,Reasons To Watch The Krack Movie,Reasons To Watch The Ravi Teja Starrer Krack Telugu Movie,Why We Watch Krack Movie,Reasons Behind Why We Watch The Ravi Teja Krack Telugu Movie

య‌దార్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా గోపీచంద్ మలినేని-రవితేజ కాంబినేషన్ లో వస్తున్న సినిమా క్రాక్. ఈ సినిమాలో శృతీ హాస‌న్ హీరోయిన్ గా నటిస్తుంది. స‌ముద్ర‌ఖనీ, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి ఈ సినిమా చూడటానికి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ గోపీచంద్ మలినేని-రవితేజ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకూ డాన్ శీను, బలుపు సినిమాలు రాగా రెండు సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు వస్తున్న సినిమా మూడో సినిమా. దీనితో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని గోపీచంద్-రవితేజతో పాటు.. అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు చాలా గ్యాప్ తరువాత శ్రుతి హాసన్ కూడా ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది.

మరో ఇంట్రెస్టింగ్ థింగ్ డైలాగ్స్.. ట్రయిలర్ రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాలో డైలాగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో చూశాం. ఇటీవల కాలంలో మంచి ఫామ్ లో ఉన్న బుర్రా సాయిమాధవ్ ఈ సినిమాకు కూడా సాలిడ్ డైలాగ్స్ రాశాడు. రవితేజ మాస్ కు తగ్గట్టు ఈ సినిమాలో డైలాగ్స్ వుంటాయని ట్రయిలర్ ను చూస్తేనే అర్ధమవుతుంది.

ఇంకా థమన్ మ్యూజిక్.. రవితేజ కిక్ తో తన ప్రయాణం మొదలుపెట్టిన థమన్ ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇక రవితేజ చాలా సినిమాలకు థమన్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాకు కూడా థమన్ మంచి పాటలు.. నేపథ్య సంగీతం అందించాడు.

సూపర్ కాస్టింగ్.. ఈ సినిమాలో సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ లాంటి నటీనటులు నటిస్తున్నారు. వీరిద్దరి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరూ మంచి టాలెంటెడ్ నటులు. ఈమధ్య కాలంలో తమ నటనతో మంచి ప్రశంసలు దక్కించుకున్నారు. అలాంటి వారు ఈసినిమాలో విలన్ పాత్రల్లో నటించడం ఈసినిమాకు మెయిన్ హైలైట్.

పాజిటివ్ రెస్పాన్స్.. ఈ సినిమాకు ముందు నుండి మంచి పాజిటివ్ రెస్పాన్సే ఉంది. దానికి తోడు మాస్ ఎలిమెంట్స్ చూపించడంలో గోపీచంద్ దిట్ట. ట్రైలర్ చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. ఇంకారవితేజ మాసిజం.. రామ్-లక్ష్మణ్ అందించిన యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో మరో హైలైట్.

మరి రేపు విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది.. గోపీచంద్-రవితేజ హ్యాట్రిక్ కొడతారా అన్నది చూడాలి..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − ten =