‘కె.జి.యఫ్ 2’ టీజర్ – దుమ్మురేపుతున్న రాఖీ భాయ్

KGF2 Movie Teaser Recieves Huge Response From Audience,KGF Chapter 2 : Yash As Rocky Bhai Takes The Fight To Adheera And Ramika Sen In The Teaser,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,KGF Chapter2,KGF Chapter2 Movie,KGF Chapter2 Telugu Movie,KGF Chapter2 Movie Updates,KGF Chapter2 Telugu Movie Latest News,KGF Chapter2 Teaser,KGF Chapter2 Movie Teaser,KGF Chapter2 Telugu Movie Teaser,KGF Chapter2 Official Teaser,Yash KGF Chapter2 Teaser

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకు రాయుళ్లు మాత్రం ఏదో ఒక విధంగా తమ ప్రతాపం చూపిస్తూనే వున్నారు. రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో తెలుసు.. అలాంటిది బాహుబలి సినిమాకే లీకులు తప్పలేదు. ఇక పవన్ నటించిన అత్తారింటి దారేది సినిమా అయితే సగానికి పైగా నెట్ లో దర్శనమిచ్చింది. అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందనుకోండి. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న వకీల్ సాబ్ సినిమా ఫైట్ కు సంబంధించి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో లీకయ్యాయి. ఇక ఇప్పుడు దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కె.జి.యఫ్ 2 కు కూడా లీకు రాయుళ్లు పెద్ద షాకే ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ రోజు యష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను 10 గంటల 18నిమిషాలకు రిలీజ్ చేద్దామని టైం ఫిక్స్ చేశారు. ఇక ఫ్యాన్స్ ఆ టైం కోసంవేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ లోపు టీజర్ ను లీక్ చేసేయడంతో.. రాత్రే టీజర్ ను రిలీజ్ చేసేశారు చిత్రయూనిట్. అయితే సినిమాలో మ్యాటర్ ఉంటే ఎన్ని లీకులు చేసిన ఏం చేయలేరు అన్న విషయాన్ని మరోసారి ఈ టీజర్ నిరూపించింది.

ప్రస్తుతం యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది ఈ టీజర్. విడుదలైన కొద్దినిమిషాల్లోనే మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇక టీజర్ విషయానికి వస్తే ఇంగ్లీష్ వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్‌ను రూపొందించారు. సినిమాకు కీలకమైన పాత్రలన్నింటినీ పరిచయం చేశారు. ఆఖరిలో రాఖీ భాయ్‌ని చూపించారు. పెద్ద మెషీన్ గన్‌తో కారులన్నిటిని గాల్లోకి లేపిన రాఖీ భాయ్.. ఎర్రగా మారిన ఆ మెషీన్ గన్ గొట్టంతో సిగరెట్ వెలిగించుకోవడం టీజర్ కే హైలైట్. మరి టీజ‌ర్‌తో సినిమాపై భారీ ఆస‌క్తిని క‌లిగించారు కేజీఎఫ్ 2 చిత్ర బృందం. చూద్దాం మరి సినిమా ఇంకే రేంజ్ లో ఉంటుందో.

కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై  నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి చూద్దాం ఇది ఎంత వరకూ సక్సెస్ అవుతుందో…ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 10 =