అన్ని వర్గాల వారికి ‘మాస్టర్’ పెద్ద ట్రీట్‌

Master Will Be A Feast For Audience Of All Classes Says Director Lokesh Kanagaraj,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Director Lokesh Kanagaraj,Director Lokesh Kanagaraj Latest News,Director Lokesh Kanagaraj About Master Movie,Master Telugu Movie

లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న సినిమా మాస్టర్. కాలేజ్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను సంక్రాంతి పండుగకు జనవరి 13న రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం భారీ రేంజ్ లో ప్రమోషన్ కార్యక్రమాలు చేసే పనిలో పడ్డారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తెలుగులో ఈ సినిమా హక్కులను ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు దక్కించుకున్నారు. ఇంతకు ముందు హీరో విజయ్‌ చిత్రం ‘విజిల్‌’ను తెలుగులో ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరే విడుదల చేశారు. ‘విజిల్‌’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో ‘మాస్టర్‌’ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలవుతుంది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వుతుందన్న నమ్మకంతో వున్నారు.

ఇక ఈ రోజు ఈ సినిమా సీడీని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా‌ లోకేశ్‌ కనకరాజ్‌ మాట్లాడుతూ – “మాస్టర్‌ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న మహేశ్‌ కోనేరుగారికి అభినందనలు. సినిమా చాలా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. నా గత రెండు చిత్రాలను తెలుగు ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు. ఇప్పుడు మాస్టర్‌ జనవరి 13న విడుదలవుతుంది. ఎప్పటిలాగానే ప్రేక్షకుల ఆశీర్వాదం ఉంటుందని భావిస్తున్నాను. సినిమా అన్ని వర్గాల వారికి ట్రీట్‌లా ఉంటుందని డైరెక్టర్ తెలిపాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 5 =