‘శాకుంతలం’ – శకుంతల లుక్ టెస్ట్ వర్కింగ్ సెషన్స్

Shakuntalam Movie Team Shares A Sneak Peek Of Movie Working Stills On Social Media,Latest Telugu Movies News, Latest Tollywood News, Massive Sets For Shakuntalam Movie Shooting, Shakuntalam, Shakuntalam Movie, Shakuntalam Movie Shooting Updates, Shakuntalam Movie Team To Erect Massive Sets For Shooting Work, Shakuntalam Movie Updates, Shakuntalam Telugu Movie, Shakuntalam Telugu Movie Latest News, Shakuntalam Telugu Movie Shooting Latest News, Telugu Film News 2021, Telugu Filmnagar, Tollywood Movie Updates

గుణశేఖర్ పౌరాణిక కథాంశంతో ‘శాకుంతలం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది శాకుంతలం. ఇన్ని ప్రధాన పాత్రలో ఎవరు నటిస్తారా అన్న ప్రశ్నకు ఇటీవలే శాకుంతల పాత్రలో అక్కినేని కోడలు నటించనున్నట్లుగా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు గుణశేఖర్. ఇక సినిమాలో సెట్స్ గురించి గుణశేఖర్ ఎంత క్రియేటివిటీ తో ఎంత అద్భుతంగా ప్లాన్ చేస్తాడో చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఒక్కడు సినిమాలోనే చార్మినార్ సెట్ ఒకటి చాలు చెప్పుకోడానికి. ఇక రుద్రమదేవి సినిమాలో మరో అద్భుతం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి అసలే ఇప్పుడు చేసేది పౌరాణిక ప్రేమ. ఇది మహాభారతలోని ఆదిపర్వంలోగల ఒక కథాంశం. ఇంకెంత ప్లాన్ చేస్తాడు. ఈ సినిమా కోసం కూడా భారీ సెట్ ప్లాన్ చేస్తున్నాడట గుణశేఖర్. దాదాపు ఎక్కువ శాతం అక్కడే షూటింగ్ జరిగేలా చూడనున్నట్లుగా తెలుస్తోంది. పౌరాణిక సినిమా కావడంతో అందుకు తగ్గుట్టుగా సెట్ ఉండేలాగా గుణశేఖర్ దగ్గరుండి మరీ పనులను పరిశీలిస్తున్నాడట.

మరోవైపు ఈ సినిమాలో సమంత శకుంతల లుక్ కోసం పనిచేస్తున్నట్టు తెలిపాడు గుణశేఖర్. నీతూ లుల్లా ఆధ్వర్యంలో ఈ టెస్ట్ లుక్ సెషన్స్ జరుగుతున్నట్టు తెలిపాడు. కాగా ఈ పాన్ ఇండియా చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమారై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మెలొడీబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిచనున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత గుణశేఖర్ రానాతో `హిర‌ణ్య‌క‌శ్య‌ప‌`సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమానే. ఈ సినిమాను ఓ హాలీవుడ్ సంస్థ‌తో క‌లిసి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్ర ప్రీప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా ఎప్పుడో పూర్త‌యింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − seven =