“శ్యామ్ సింగ రాయ్ ” మూవీ కి భారీ సెట్ ?

Shyam Singh Roy Movie Team Erects Massive Set For Shooting Work,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Shyam Singh Roy,Shyam Singh Roy Movie,Shyam Singh Roy Telugu Movie,Shyam Singh Roy Movie Updates,Shyam Singh Roy Telugu Movie Latest News,Shyam Singh Roy Movie Shooting Updates,Shyam Singh Roy Telugu Movie Shooting Latest News,Shyam Singh Roy Movie Team Shooting Work,Nani

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన “టక్ జగదీష్ ” మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. హీరో నాని ప్రస్తుతం నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో కోల్ కత్తా నేపథ్యంలో పీరియాడికల్ మూవీ “శ్యామ్ సింగరాయ్ ” లో నటిస్తున్నారు . సాయి పల్లవి , “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతిశెట్టి , మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. రాహుల్ రవీంద్రన్ , మురళీశర్మ , అభినవ్ గోమఠం ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“శ్యామ్ సింగ రాయ్ ” మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీ కై హైదరాబాద్ లో కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో 6 కోట్ల వ్యయం తో ఒక భారీ సెట్ ను రూపొందిస్తున్నారని సమాచారం. కోల్ కత్తా నగరం తో పాటు కాళికా దేవి ఆలయం కూడా ఈ సెట్ లో రూపొందనుంది. ఈ సెట్ ను ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల 15 ఎకరాలలో రూపొందిస్తున్నారనీ , మార్చి నెలలో షూటింగ్ ప్రారంభం కానుందనీ సమాచారం. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ తరువాత హీరో నాని , మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందనున్న “అంటే .. సుందరానికీ !” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 1 =