మరో ప్రాణం – మహేష్ @1019

Super Star Mahesh Babu Saves Life Of A Kid Again,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Super Star Mahesh Babu,Super Star Mahesh Babu Latest News,Super Star Mahesh Babu New Movie News,Super Star Mahesh Babu Next Project News,Super Star Mahesh Babu Latest Film Details

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్ లు చేయించిన సంగతి తెలిసిందే కదా. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేయికి పైగా చిన్న గుండెలకు మహేష్ ఆయువుపోశాడు. గత మూడేళ్ళ కాలంలో మహేష్ బాబు 1000 మంది చిన్నారులకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలని విజయవంతగా చేయించాడు. ఇది అందరికీ తెలిసిందే. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా మరో చిన్నారి పసి గుండెకు ప్రాణం పోసాడు. దీనితో ఈ సంఖ్య 1019 కు చేరింది. ఈ విషయాన్నే నమ్రత ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ఆంధ్రా హాస్పిటల్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపిన ఆమె సర్జరీ చేయించుకున్న చిన్నారి క్షేమంగా ఉందని అన్నారు.

కాగా మహేష్ ఏన్నో సేవా వా కార్యక్రమాలు చేసినా పెద్దగా బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడే వ్యక్తి కాదు. ఇప్పటికే మహేష్ పలు గ్రామాల్ని దత్తత తీసుకొని వాటిని అభివృద్ది చేయడంలో కృషిచేస్తున్నాడు. అలాగే నిరు పేద‌ల‌కి ఆయన అండ‌గా ఉంటున్నాడు.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.