‘రంగమార్తాండ’ గురూజీ మొదలుపెట్టారు

Krishna Vamsi Shares A Candid Picture Of Sirivennela Seetharama Sastry Working On Rangamarthanda Movie Lyrics,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rangamarthanda,Rangamarthanda Movie,Rangamarthanda Telugu Movie,Rangamarthanda Movie Updates,Rangamarthanda Telugu Movie Latest News,Rangamarthanda Movie Live Updates,Krishna Vamsi,Sirivennela Seetharama Sastry,Sirivennela Seetharama Sastry Working On Rangamarthanda Movie Lyrics

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో ‘రంగ మార్తాండ’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నానా పాటేకర్ హీరోగా నటించిన ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్ డేట్ ఇచ్చారు కృష్ణవంశీ. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ సినిమా కోసం పాటలు రాయడం స్టార్ట్‌ చేశారని తెలుపుతూ.. ఓ ఫొటోని షేర్‌ చేశారు. ”రంగమార్తాండ.. గురూజీ మొదలెట్టారు.. అద్భుతమైన పదాలు జీవితంలో భాగం కాబోతున్నాయి..” అంటూ ట్వీట్ చేశారు.

ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో నటిస్తుండగా.. అనసూయ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మికలు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ‘అంతఃపురం’ సినిమాకు మ్యూజిక్ అందించిన ఇళయరాజా మరోసారి ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. చాలా ఏళ్ళ తరువాత ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రూ జ‌ట్టు క‌ట్టారు.

టాలీవుడ్‌లో క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ.. గతకొద్ది కాలంగా ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయిన సంగతి తెలిసిందే. ‘చందమామ’ తర్వాత ఆ స్థాయి హిట్టు ఇవ్వలేకపోయాడు. మరి ఈ సినిమాతో అయినా మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూద్దాం.

 

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =