జనవరి 14 వచ్చేస్తున్న ‘వకీల్ సాబ్’

Vakeel Saab Movie Team Confirms Teaser Release Date and Time,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Telugu Movie,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Vakeel Saab Teaser Release Date,Vakeel Saab Movie Teaser Release Date Locked,Vakeel Saab Telugu Movie Teaser Release Date Confirmed,Vakeel Saab Teaser Release Date Fixed

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. చాలా గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు ‘వకీల్ సాబ్’ రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవలే వకీల్ సాబ్ చిత్రయూనిట్ కూడా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ నుంచి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. క్లైమాక్స్ ఫైట్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్ర‌ముఖ న‌టుడు దేవ్ గిల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. మరోవైపు సంక్రాంతి ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్ టైంను ఫిక్స్ చేశారు. జనవరి 14న సాయంత్రం 6.03 గంటలకు ‘వకీల్ సాబ్’ టీజర్ విడుదల చేయనున్నట్టు అధికారికంగా తెలిపారు.

ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి,శ్రుతిహాసన్‌ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. బోనీ కపూర్‌ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + seven =