ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 91
సిక్స్ ప్యాక్ మళ్ళీ సిద్ధం - నిఖిల్
"రాధే శ్యామ్ " మూవీ లో ఎయిర్ టెల్ బ్యూటీ ?
బయో ఎంజైమ్స్ రెడీ చేస్తున్న సమంత

5ఏళ్ల బాహుబలి.. ఎన్నో రికార్డులు ..!

మూవీ ఫీచర్ ఆర్టికల్: "అన్నమయ్య "
సక్సెస్-ఫెయిల్యూర్ ను నేను పట్టించుకోను..!
నా జీవితంలో '3 ఎఫ్' లు..!
మొన్న బుక్.. నేడు వెబ్ సిరీస్..!
ఇన్ స్టా గ్రామ్ లో త్రిష సెల్ఫీ

"సింహాద్రి " మూవీ 17 సంవత్సరాలు పూర్తి
ఇలియానా ఆన్ లైన్ వర్కౌట్
తెలుగు వెబ్ సిరీస్ లో పాయల్ రాజ్ పుత్
'కప్పేల' రీమేక్ లో విశ్వక్ సేన్..!
శ్రద్ధ సూటి ప్రశ్న - పెళ్లయ్యాక హీరోయిన్‌కి డిమాండ్ తగ్గుతుందా..?
పెళ్లయ్యాక హీరోయిన్‌కి డిమాండ్ తగ్గుతుందా..?ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే. ఎందుకంటే ఒకప్పుడు పాతతరం హీరోయిన్స్ లో చాలా మంది పెళ్లి అయిన తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. అంతెందుకు మహానటి సావిత్రి కూడా సినీ రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే పెళ్లి చేసుకుంది. పెళ్ళైన తర్వాతే మాయాబజార్ లాంటి ఆల్ టైం క్లాసిక్ సినిమాలో నటించింది. సావిత్రి సినీ ప్రయాణంలో పెళ్ళికి ముందు - పెళ్ళి తర్వాత అనే బేధాలు లేవు. ఇక అంజలీ దేవి అయితే పెళ్ళైన తర్వాతనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఇంకా ఎంతో మంది పాతతరం హీరోయిన్స్ పెళ్ళైన తర్వాత కూడా రాణించారు.
సిక్స్ ప్యాక్ మళ్ళీ సిద్ధం - నిఖిల్
సక్సెస్ ఫుల్ "హ్యాపీ డేస్ " మూవీ తో లీడ్ రోల్ లో టాలీవుడ్ కు పరిచయం అయిన నిఖిల్ "యువత ", "స్వామి రారా ", "కార్తికేయ ", "ఎక్కడికి పోతావు చిన్నవాడా ", "అర్జున్ సురవరం " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నిఖిల్ ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో సూపర్ హిట్ "కార్తికేయ " మూవీ సీక్వెల్ "కార్తికేయ 2", పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో "18 పేజెస్ " మూవీస్ లో నటిస్తున్నారు. కరోనా కారణంగా ఆ మూవీస్ షూటింగ్స్ నిలిచిపోయాయి.
"రాధే శ్యామ్ " మూవీ లో ఎయిర్ టెల్ బ్యూటీ ?
"కట్టీ బట్టీ " బాలీవుడ్ మూవీ లో చిన్న పాత్రలో నటించిన సాషా ఎయిర్ టెల్ యాడ్ లో నటించి ఓవర్ నైట్ సెన్సేషన్ క్రియేట్ చేసి జాతీయ స్థాయి లో గుర్తింపు పొందారు. కాన్ఫిడెంట్ తో , స్టైలిష్ గా ఉండే సాషా "ఆపరేషన్ గోల్డ్ ఫిష్ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సాషా ఇప్పుడు ప్రభాస్ మూవీ " రాధే శ్యామ్ " కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
'మిడిల్ క్లాస్ మెలోడీస్' గా వస్తున్న ఆనంద్ దేవరకొండ..!
విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టేసాడు ఆనంద్ దేవరకొండ. వచ్చీ రాగానే ఫైట్స్, మాస్ ఎలిమెంట్స్ అని కాకుండా పాత్ర ప్రధానమైన కథను ఎంచుకున్నాడు. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన దొరసాని సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికీ నటినటులుగా ఇద్దరికీ మంచి పేరు వచ్చింది.
కన్ఫ్యూజన్ లో చరణ్ - హార్ట్ ఒకటి చెపుతుంది.. మైండ్ ఒకటి చెపుతుంది..!
మొత్తానికి రామ్ చరణ్ కన్ఫ్యూజన్ లో పడ్డాడు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే లాక్ డౌన్ లో షూటింగ్స్ లేక సెలెబ్రిటీస్ అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఏదో ఒకటి రెండు నెలలు మాత్రమే ఉంటుంది అనుకున్నారు కానీ ఇన్ని రోజులు ఈ కరోనా వల్ల బ్రేక్ వస్తుంది అని మాత్రం ఊహించలేదు. ఇక షూటింగ్స్ లేవు కాబట్టి ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తున్నారు. అయితే షూటింగ్ లేదు కదా అని వర్కౌట్స్ చేయకుండా ఉంటే కుదరదు కదా. షూటింగ్ ఉన్నా లేకపోయినా అవి మాత్రం హీరో హీరోయిన్స్ చేయాల్సిందే. చేయపోతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఎంత హీరో హీరోయిన్స్ అయినా వాళ్ళకి కూడా అప్పుడప్పుడు బద్ధకం…
బయో ఎంజైమ్స్ రెడీ చేస్తున్న సమంత
స్టార్ హీరోయిన్ సమంత లాక్ డౌన్ సమయంలో యోగా , మెడిటేషన్, ఆర్గానిక్ కూరగాయలు పండిస్తూ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటూ , తన పెట్ డాగ్ హ్యాష్ తో ఆడుకుంటూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సమంత ఇప్పుడు బయో ఎంజైమ్స్ తయారీ నేర్చుకున్నారు.

5ఏళ్ల బాహుబలి.. ఎన్నో రికార్డులు ..!
తెలుగు సినీ చరిత్రలో బాహుబలి సిరీస్ ఒక కొత్త అధ్యయనాన్ని లిఖించిందని చెప్పడంలో సందేహం లేదు. రాజమౌళి ఎంతో జాగ్రత్తగా చెక్కిన శిల్పమే ఈ బాహుబలి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ,నాజర్, సత్యరాజ్ వంటి ప్రధాన పాత్రలతో రాజమౌళి తెరకెక్కించిన ’బాహుబలి’ భారతీయ సినీ చరిత్రలోనే గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా మొదటి పార్ట్ విడుదలై నేటితో 5 ఐదేళ్లు పూర్తి చేసుకుంది. భారీ సెట్టింగులు, అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్, ఆకట్టుకునే కథ, కథనాలు, రాజమౌళి మార్క్ టేకింగ్, సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ఈ సినిమా సక్సెస్ కు ప్రధాన కారణాలు.
'ప్రభాస్20' ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్..!
ఎప్పుడైతే ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేస్తున్నామని ప్రభాస్20 టీమ్ చెప్పారో ఆ రోజు నుండే అభిమానులు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. ఎప్పుడు జులై 10.. 10 గంటలు అవుతుందా... ఎప్పుడు ఫస్ట్ లుక్ చూసేద్దామా అనిఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చేసింది. ప్రభాస్ 20 సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను యూవీ క్రియేషన్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. ఇక ఎప్పటినుండో అనుకున్నట్టే ఈ సినిమాకు 'రాధే శ్యామ్' అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు.

మూవీ ఫీచర్ ఆర్టికల్: "అన్నమయ్య "
15 వ శతాబ్దపు స్వరకర్త అన్నమాచార్య జీవిత చరిత్ర ఆధారంగా కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నాగార్జున అక్కినేని హీరోగా రూపొందిన బయోగ్రాఫికల్, డివోషనల్ మూవీ "అన్నమయ్య " 1997 సంవత్సరం మే 22 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మోహన్ బాబు , సుమన్ , రమ్యకృష్ణ , రోజా , భానుప్రియ , కస్తూరి , బ్రహ్మానందం వంటి భారీ తారాగణం తో తెరకెక్కిన "అన్నమయ్య " మూవీ కి కీరవాణి సంగీతం అందించారు. కీరవాణి స్వరపరిచిన సాంగ్స్ ప్రేక్షకులను వీనుల విందు చేశాయి.
సక్సెస్-ఫెయిల్యూర్ ను నేను పట్టించుకోను..!
బాలీవుడ్ భామ అదితి రావు హైదరి ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం లో వరుస సినిమాలు చేసుకుంటూ బిజీ హీరోయిన్ అయిపోయింది. సమ్మోహనం సినిమాతో టాలివుడ్లో అరంగేట్రం చేసిన అదితి రావు హైదరి మొదటి సినిమాకే ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నది. తరువాత అంతరిక్షం సినిమాలో నటించింది అయితే ఆ సినిమా అంత సక్సెస్ కాలేదు కానీ అదితి కి మాత్రం ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుదీర్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వి సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రలో నటిస్తుంది.
నా జీవితంలో '3 ఎఫ్' లు..!
తన జీవితం మూడు ఎఫ్ లతో ముడిపడి ఉందని చెపుతుంది రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ తన సినీ రంగ ప్రవేశం గురించి... తనకు ఎలాంటి అబ్బాయి కోసం చూస్తుందో ఇలా పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఒక మనిషిగా నేను కూడా మారుతుంటాను.. నా దృష్టిలో ప్రేమ అంటే అర్ధం నేను మా పేరెంట్స్ లో చూసేదే.. ప్రేమ, పెళ్లి పై నాకు పూర్తి నమ్మకం వుంది.. కొంతం మంది వాటి వల్ల ప్రెషర్ అంటారు అర్ధంకాదు.. నాకు తెలిసి ప్రేమ, పెళ్లి అనేవి చాలా గొప్పగా వుంటాయని అనుకుంటున్నాను.. నావరకునేనైతే ఎవరినైనా ప్రేమిస్తే హార్ట్ ఫుల్ గా ప్రేమిస్తా అని చెప్పుకొచ్చింది. అంతే కాదు తనకంటే పొడవు.. తను హీల్స్ వేసుకున్నా సరే…
మొన్న బుక్.. నేడు వెబ్ సిరీస్..!
సూపర్‌స్టార్ మహేశ్ లాక్డౌన్ సమయంలో పిల్లలతో సరదాగా సమయాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా పుస్తకాలు కూడా చదువుతూ కాలక్షేపం చేస్తున్నాడు. మొన్నామధ్య 'ఎమోషనల్ ఇంటెలిజన్స్' పుస్తకం చదవమని మహేష్ సూచించిన సంగతి తెలిసిందే. 'ఎమోషనల్ ఇంటెలిజన్స్.. సైంటిఫిక్ .. సంచలనాత్మకం.. అందరూ చదవాల్సిన పుస్తకం. ఇక ఈ వారం అంతా డానియల్ గోల్ మెన్ కే కేటాయిస్తున్నా..' అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ చూడమని చెపుతున్నాడు. ‘డార్క్’ అనే పేరుతో తెరకెక్కిన జర్మన్ వెబ్ సిరీస్‌ను చూశానని, రచన, దాన్ని తీసిన తీరు అత్యద్భుతంగా ఉన్నాయని మహేశ్ తెలిపారు. అంతే కాకుండా ఈ…
ఇన్ స్టా గ్రామ్ లో త్రిష సెల్ఫీ
టాలీవుడ్ , కోలీవుడ్ లలో 2దశాబ్దాలుగా పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న త్రిష స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పలు మూవీస్ కు త్రిష బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. లాక్ డౌన్ సమయం లో ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించిన త్రిష ప్రస్తుతం 6 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ త్రిష ఇప్పుడు ఒక తమిళ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
ఆర్జీవీ 'పవర్ స్టార్'.. పవన్-చిరు ఒకే ఫ్రేమ్ లో..!
ప్రకటించిన సినిమాలన్నీ రిలీజ్ కు నోచుకుంటాయో..లేదో..తెలియదు కానీ వారానికో సినిమాను ప్రకటిస్తున్నాడు వర్మ. అదేం విచిత్రమో కానీ అందరూ లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు వెళ్లాలంటేనే భయపడుతుంటే.. వర్మ మాత్రం ఎప్పుడు షూటింగ్ తీస్తున్నాడో తెలియదు కానీ ఫస్ట్ లుక్ లు, టీజర్ లు, ట్రైలర్ లు రిలీజ్ చేస్తూ అందరికీ షాకిస్తున్నాడు. ఇప్పటికే నాలుగైదు సినిమాలు ప్రకటించిన వర్మ రెండు రోజుల క్రితం ''పవర్ స్టార్' అనే సినిమాను తీయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అలా ప్రకటించాడో లేదో అప్పుడే ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేసాడు. ఫస్ట్ లుక్ విడుదల చేసి దానితో పాటు వర్మ పోస్టర్ పై ఎన్నికల తరువాత కథ అని, సినిమా…

"సింహాద్రి " మూవీ 17 సంవత్సరాలు పూర్తి
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిందిన "స్టూడెంట్ నెం 1" మూవీ ఘనవిజయంసాధించిన విషయం తెలిసిందే. "స్టూడెంట్ నెం 1" మూవీ తో టాలీవుడ్ కు రాజమౌళి దర్శకుడిగా పరిచయం అయ్యారు. దర్శకుడు రాజమౌళి తన రెండవ మూవీ కూడా ఎన్టీఆర్ తో రూపొందించారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన యాక్షన్ డ్రామా "సింహాద్రి " మూవీ 2003 సంవత్సరం జులై 9వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇలియానా ఆన్ లైన్ వర్కౌట్
బ్లాక్ బస్టర్ "దేవదాసు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన గోవా బ్యూటీ ఇలియానా "పోకిరి "," జల్సా", "కిక్ ", "జులాయి " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి స్టార్ హీరోయిన్ హోదా అందుకున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న టైమ్ లోనే బ్లాక్ బస్టర్ "బర్ఫీ" మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించారు. హిందీ మూవీస్ తో ఇలియానా బిజీగా మారారు. ఇలియానా ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ హీరోగా రూపొందుతున్న "ది బిగ్ బుల్ " హిందీ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్నారు.
విజయ్ 'మాస్టర్' రిలీజ్ పై నిర్మాత క్లారిటీ - దీపావళి లేదా పొంగల్..!
లాక్ డౌన్ పుణ్యమా అని ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎక్కడ రిలీజ్ అవుతుందో కూడా చెప్పడం కష్టంగానే వుంది. చిన్న సినిమాలు చిన్నగా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. అయితే పెద్ద బడ్జెట్ తో సినిమా తీసిన దర్శక నిర్మాతలు మాత్రం అంత ధైర్యం చేయలేకపోతున్నారు. కాస్త లేట్ అయినా ఎట్టిపరిస్థితుల్లోనూ థియేటర్ లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈ లిస్ట్ లో మాస్టర్ సినిమా కూడా ఉంది. మాస్టర్ సినిమా కూడా ఏదిఏమైనా థియేర్లోనే రిలీజ్ చేస్తామని చెపుతున్నారు నిర్మాత.
తెలుగు వెబ్ సిరీస్ లో పాయల్ రాజ్ పుత్
భారత చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తుంది. హిందీ , తమిళ , తెలుగు భాషలలో వెబ్ సిరీస్ లు రూపొందుతున్న విషయం తెలిసిందే. వెబ్ సిరీస్ తో పాటు మూవీస్ కూడా OTT ప్లాట్ ఫారం లో ప్రదర్శిస్తున్నారు. OTT ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరవుతామనే ఆలోచనతో స్టార్ హీరోయిన్స్ తో పాటు యంగ్ హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపుతున్నారు.
'కప్పేల' రీమేక్ లో విశ్వక్ సేన్..!
లాక్ డౌన్ వల్ల థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు సినిమాలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోనే రిలీజ్ చేస్తున్నారు. అలా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అయి పెద్ద హిట్ కొట్టిన సినిమా కప్పేల. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అన్నా బెన్, శ్రీనాథ్ భాసి, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రల్లో నటించి తమ నటనతో ఫిదా చేసేశారు. 2020 లో అతిపెద్ద విజయం అందుకున్న సినిమాల జాబితాలో చేరింది.
"పవర్ స్టార్ " మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న "పవర్ స్టార్ " మూవీ టైటిల్ పోస్టర్ ఈరోజు రోలీజ్ అయింది. టైటిల్ మధ్యలో గాజు గ్లాస్ పెట్టి నటుడి హాఫ్ ఫొటో తో పోస్టర్ రిలీజ్ చేసి ప్రేక్షకులకు వర్మ షాక్ ఇచ్చారు. ఈ మూవీ గురించి వర్మ మాట్లాడుతూ .. టైటిల్ చూసి ప్రేక్షకులు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని , తాను పవన్ కళ్యాణ్ బయోపిక్ తీయడం లేదని స్పష్టం చేశారు. ఈ పోస్టర్ లో ఉన్న నటుడు ఎవరినైనా పోలి ఉంటే అది యాదృశ్చికమే అన్నారు.