శ్రద్ధ సూటి ప్రశ్న – పెళ్లయ్యాక హీరోయిన్‌కి డిమాండ్‌ తగ్గుతుందా..?

Does Marital Status Of An Actress Affects Her Film Career Asks Jersey Actress Shraddha Srinath On Social Media

పెళ్లయ్యాక హీరోయిన్‌కి డిమాండ్‌ తగ్గుతుందా..?ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే. ఎందుకంటే ఒకప్పుడు పాతతరం హీరోయిన్స్ లో చాలా మంది పెళ్లి అయిన తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. అంతెందుకు మహానటి సావిత్రి కూడా సినీ రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే పెళ్లి చేసుకుంది. పెళ్ళైన తర్వాతే మాయాబజార్ లాంటి ఆల్ టైం క్లాసిక్ సినిమాలో నటించింది. సావిత్రి సినీ ప్రయాణంలో పెళ్ళికి ముందు – పెళ్ళి తర్వాత అనే బేధాలు లేవు. ఇక అంజలీ దేవి అయితే పెళ్ళైన తర్వాతనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఇంకా ఎంతో మంది పాతతరం హీరోయిన్స్ పెళ్ళైన తర్వాత కూడా రాణించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి ఇప్పుడు పరిస్థితి కూడా అలానే ఉందా అంటే.. అది సమాధానంలేని ప్రశ్న. ఎందుకంటే అప్పటి రోజులు ఇప్పటి రోజులు ఒకటి కాదు. సినిమా పద్ధతులు మారిపోయాయి.. ప్రేక్షకుడి దృష్టి మారిపోయింది. ఇప్పుడు ప్రేక్షకుడికి ఎలా తీస్తే నచ్చుతుందో అని దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా సినిమాలు తీస్తున్నారు. ఇక హీరోస్ విషయంలో మాత్రం అప్పటికీ.. ఇప్పటికీ తేడా లేదని చెప్పొచ్చు కానీ హీరోయిన్స్ విషయంలో మాత్రం తేడాలున్నాయని చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే ఇప్పుడు హీరోయిన్స్ కు సినీ కెరీర్ వాలిడిటీ తక్కువ రోజులే. ఉన్నంతలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని సినిమాలు చేసుకొని స్టార్ హీరోయిన్ హోదా వస్తే ఒక 10ఏళ్ళు ఎలాంటి ఢోకా లేకుండా ఉండొచ్చు. ఇక పెళ్ళైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదో సమంత లాంటి హీరోయిన్స్ కు అది వర్కౌట్ అవుతుంది తప్పా… పెళ్ళైతే ఏ హీరోయిన్ అయినా హీరోయిన్ ఛాన్స్ లకు గుడ్ బాయ్ చెప్పుకోవాల్సిందే.

ఇప్పుడు ఇదే ప్రశ్న జెర్సీ హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ సోషల్ మీడియా వేదికగా అడుగుతుంది. `పెళ్లయ్యాక హీరోయిన్‌కి నిజంగానే డిమాండ్‌ తగ్గుతుందా? మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి చర్చించండి. ఇది పది మార్కుల ప్రశ్న` అంటూ శ్రద్ధ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. ఇలా అడగటానికి కారణం కూడా చెప్పుకొచ్చింది ఈ భామ. త్వరలో నా ఫ్రెండ్ పెళ్లి చేసుకోబోతుంది. తను కూడా ఒక నటే. అయితే `పెళ్లి తర్వాత కూడా తను నటిస్తుందా?` అని సినీ పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి నన్ను అడిగారు. ఆ ప్రశ్న నన్ను ఆలోచనలో పడేసింది…పెళ్లి చేసుకున్న హీరోలు రొమాంటిక్‌ సీన్స్‌లో నటిస్తున్నారు కదా? ఇలాంటి ప్రశ్నలు వారిని ఎందుకు అడగరు? ఈ విషయం గురించి మీ స్పందన తెలుసుకోవాలనుకుంటున్నాను` అని శ్రద్ధ పేర్కొంది. ఇక ఇంత ప్రశ్న అడిగిన తర్వాత మన నెటిజన్స్ ఊరుకుంటారా.. ఎవరికి తోచిన సమాధానం వారు చెపుతున్నారు.

 

కాగా ‘జెర్సీ’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది శ్రద్ధ. ఆ సినిమాలో శ్రద్ధా.. తన నటనతో అదరగొట్టింది. తాజాగా తెలుగులో నటించిన ‘కృష్ణ అండ్ హిజ్‌ లీల’ మూవీ ఓటీటీలో రిలీజ్‌అయింది. ఈ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక తెలుగులోనే కాకుండా అటు కన్నడ, తమిళ సినిమాలు చేస్తోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − two =