విజయ్ ‘మాస్టర్’ రిలీజ్ పై నిర్మాత క్లారిటీ – దీపావళి లేదా పొంగల్..!

Master Movie Producer Announce Tentative Release Dates For Movie Release Says No Plans Of Releasing Movie On OTT Platforms

లాక్ డౌన్ పుణ్యమా అని ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎక్కడ రిలీజ్ అవుతుందో కూడా చెప్పడం కష్టంగానే వుంది. చిన్న సినిమాలు చిన్నగా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. అయితే పెద్ద బడ్జెట్ తో సినిమా తీసిన దర్శక నిర్మాతలు మాత్రం అంత ధైర్యం చేయలేకపోతున్నారు. కాస్త లేట్ అయినా ఎట్టిపరిస్థితుల్లోనూ థియేటర్ లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈ లిస్ట్ లో మాస్టర్ సినిమా కూడా ఉంది. మాస్టర్ సినిమా కూడా ఏదిఏమైనా థియేర్లోనే రిలీజ్ చేస్తామని చెపుతున్నారు నిర్మాత.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లోకేష్ కనగరాజు దర్శకత్వంలో విజయ్ ‘మాస్టర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది చిత్రయూనిట్. ఇక ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ఓటీటీ లో రిలీజ్ అవుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇక మరోసారి ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు. భారీ బడ్జెట్ తో మాస్టర్ సినిమాను తెరకెక్కించాం.. థియేటర్స్ ఓపెన్ అవ్వడానికి లేట్ అయినా పర్లేదు మేము మాత్రం థియేటర్ లోనే రిలీజ్ చేస్తాం.. దీపావళి లేదా పొంగల్ లో ఈ సినిమా ను రిలీజ్ చేస్తాం అని చెప్పారు.

కాగా ఈ సినిమాలో విజయ్‌ కు జోడీగా మాళవిక మోహనన్ నటిస్తుంది. ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నాడు. మలయాళ నటుడు ఆంటొని, శాంతను కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులోను కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో విజయ్ గ్యాంగ్ స్టర్ గా .. కాలేజ్ ప్రొఫెసర్ గా రెండు విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నాడు. మరి ఇటీవలే బిగిల్ సినిమాతో హిట్ కొట్టిన విజయ్.. ఈ సినిమాతో ఎంత హిట్ కొడతాడో చూడాలి…

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 20 =