సక్సెస్-ఫెయిల్యూర్ ను నేను పట్టించుకోను..!

I Don't Bother About The Success or Failure Of My Movies Says Actress Aditi Rao Hydari

బాలీవుడ్ భామ అదితి రావు హైదరి ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం లో వరుస సినిమాలు చేసుకుంటూ బిజీ హీరోయిన్ అయిపోయింది. సమ్మోహనం సినిమాతో టాలివుడ్‌లో అరంగేట్రం చేసిన అదితి రావు హైదరి మొదటి సినిమాకే ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నది. తరువాత అంతరిక్షం సినిమాలో నటించింది అయితే ఆ సినిమా అంత సక్సెస్ కాలేదు కానీ అదితి కి మాత్రం ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుదీర్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వి సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రలో నటిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాను నటించిన మలయాళం సినిమా ఇటీవలే రిలీజ్ అయింది. ‘సూఫియుమ్‌ సుజాతయుమ్‌’ సినిమాలో నటించింది అదితి. థియేటర్లలో విడుదల కోసమే ఈ చిత్రం తీశారు. అయితే, కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో ఓటీటీలో రిలీజ్ చేశారు. తన భార్య మరొకరితో ప్రేమలో ఉందని తెలిశాక, కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచడం కోసం భర్త ఎటువంటి ప్రయత్నాలు చేశాడనే కథతో ఈ సినిమా రూపొందించారు. అయితే ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. ఇక దీనిపై స్పందించిన అదితి సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ ను నేను పెద్దగా పట్టించుకోను.. సినిమా చేసేప్పుడే నేను ఆ ఫీలింగ్ ను ఎంజాయ్ చేస్తాను అని తెలిపింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =