మూవీ ఫీచర్ ఆర్టికల్: “అన్నమయ్య “

Today's Movie Feature Article: Annamayya

15 వ శతాబ్దపు స్వరకర్త అన్నమాచార్య జీవిత చరిత్ర ఆధారంగా కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నాగార్జున అక్కినేని హీరోగా రూపొందిన బయోగ్రాఫికల్, డివోషనల్ మూవీ “అన్నమయ్య ” 1997 సంవత్సరం మే 22 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మోహన్ బాబు , సుమన్ , రమ్యకృష్ణ , రోజా , భానుప్రియ , కస్తూరి , బ్రహ్మానందం వంటి భారీ తారాగణం తో తెరకెక్కిన “అన్నమయ్య ” మూవీ కి కీరవాణి సంగీతం అందించారు. కీరవాణి స్వరపరిచిన సాంగ్స్ ప్రేక్షకులను వీనుల విందు చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అన్నమయ్య ” మూవీ పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది. 42 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుని , రెండు సెంటర్స్ లో 176 రోజులు ప్రదర్శించబడింది. చెన్నై లో కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. “అన్నమయ్య ” మూవీ 2 నేషనల్ , 3 ఫిల్మ్ ఫేర్ , 8 నంది అవార్డ్స్ అందుకుంది. అప్పటి వరకూ కమర్షియల్ మూవీస్ లో నటించిన హీరో నాగార్జున ఫస్ట్ టైమ్ భక్తి రస చిత్రం “అన్నమయ్య ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ , నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఈ మూవీ నాగార్జున సినీ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది. 20 సాంగ్స్ ఉన్న మ్యూజిక్ ఆల్బమ్ రెండు వాల్యూమ్స్ గా రిలీజ్ అయింది. ఆ 20సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “అన్నమయ్య ” మూవీ మ్యూజిక్ ఆల్బమ్ అత్యధికం గా సేల్స్ అయ్యి రికార్డ్ క్రియేట్ చేసింది. అన్నమయ్య ” మూవీ మ్యూజిక్ ఆల్బమ్ సేల్స్ ను ఈ రోజు వరకూ మరే మూవీ క్రాస్ చేయలేకపోవడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 3 =