‘కప్పేల’ రీమేక్ లో విశ్వక్ సేన్..!

HIT Movie Fame Vishwak Sen To Play The Lead In Koppela Telugu Remake

లాక్ డౌన్ వల్ల థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు సినిమాలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోనే రిలీజ్ చేస్తున్నారు. అలా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అయి పెద్ద హిట్ కొట్టిన సినిమా కప్పేల. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అన్నా బెన్, శ్రీనాథ్ భాసి, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రల్లో నటించి తమ నటనతో ఫిదా చేసేశారు. 2020 లో అతిపెద్ద విజయం అందుకున్న సినిమాల జాబితాలో చేరింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా చూసిన మన తెలుగు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా తనకు ఈ సినిమా ఎంతో నచ్చిందని పేర్కోన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా రీమేక్ హక్కులను సితార ఎంటర్‌టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. ‘ప్రేమమ్’, ‘అయ్యప్పనుమ్ కొషియుం’ తరవాత సితార ఎంటర్‌టైన్మెంట్స్ కొనుగోలు చేసిన మూడో చిత్రం ఇది.

ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అప్పుడే ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం ఒక యంగ్ హీరో సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఆ యంగ్ హీరో ఎవరో కాదు. ‘ఫలక్ నుమా దాస్’, ‘హిట్’ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వక్ సేన్. శ్రీనాథ్ భాసి పాత్ర కోసం విశ్వక్ సేన్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నటు సమాచారం. మరి మిగిలిన నటీనటుల వివరాలు తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − four =