టాలీవుడ్ , కోలీవుడ్ లలో 2దశాబ్దాలుగా పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న త్రిష స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పలు మూవీస్ కు త్రిష బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. లాక్ డౌన్ సమయం లో ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించిన త్రిష ప్రస్తుతం 6 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ త్రిష ఇప్పుడు ఒక తమిళ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



లోక్ డౌన్ సమయంలో త్రిష కొన్ని రోజులు సోషల్ మీడియా కు దూరమైన విషయం తెలిసిందే. తన మనసు మార్పు కోరుకుంటుందని , కొన్ని రోజుల పాటు సోషల్ మీడియా కు దూరంగా ఉంటానని, తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న ఫాలోవర్స్ కు త్రిష కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని రోజుల తరువాత సోషల్ మీడియా లో ఎంటర్ అయిన త్రిష ఇప్పుడు తన సెల్ఫీ ని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. సహజ సౌందర్యం తో ఉన్న ఆ సెల్ఫీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























