ఆర్జీవీ ‘పవర్ స్టార్’.. పవన్-చిరు ఒకే ఫ్రేమ్ లో..!

Ram gopal varma posts a picture from powerstar movie that showcases chiranjeevi and pawan kalyan characters in one frame

ప్రకటించిన సినిమాలన్నీ రిలీజ్ కు నోచుకుంటాయో..లేదో..తెలియదు కానీ వారానికో సినిమాను ప్రకటిస్తున్నాడు వర్మ. అదేం విచిత్రమో కానీ అందరూ లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు వెళ్లాలంటేనే భయపడుతుంటే.. వర్మ మాత్రం ఎప్పుడు షూటింగ్ తీస్తున్నాడో తెలియదు కానీ ఫస్ట్ లుక్ లు, టీజర్ లు, ట్రైలర్ లు రిలీజ్ చేస్తూ అందరికీ షాకిస్తున్నాడు. ఇప్పటికే నాలుగైదు సినిమాలు ప్రకటించిన వర్మ రెండు రోజుల క్రితం ”పవర్ స్టార్’ అనే సినిమాను తీయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అలా ప్రకటించాడో లేదో అప్పుడే ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేసాడు. ఫస్ట్ లుక్ విడుదల చేసి దానితో పాటు వర్మ పోస్టర్ పై ఎన్నికల తరువాత కథ అని, సినిమా దేనిగురించి ఉంటుందో ఓ హింట్ కూడా ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దాని తర్వాత మరో పోస్టర్ ను కూడా రిలీజ్ చేసాడు. అంతేకాదు నా పవర్ స్టార్ సినిమాలో ఇద్దరు బ్రదర్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. మరి గతంలో ఎన్నికల తర్వాత పరిస్థితులను ఆధారం చేసుకొని అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అని సినిమా తీసాడు. అప్పట్లో ఆ సినిమా పెద్ద వివాదాలకే దారి తీసింది. మరి ఈ సినిమాపై ఎంత దుమారం రేగుతుందో… పవన్ ఫ్యాన్స్ దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


దీనితో పాటు మర్డర్, వైరస్, 12 ఓ క్లాక్,’కిడ్నాపింగ్ ఆఫ్ కత్రినా కైఫ్’ ‘ది మ్యాన్ హూ కిల్లుడ్ గాంధీ’ అనే సినిమాలు కూడా తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ సినిమాలన్నీ థియేటర్లో రిలీజ్ అవుతాయా లేక ఆర్జీవీవరల్డ్ థియేటర్ లో రిలీజ్ అవుతాయా చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 17 =