నా జీవితంలో ‘3 ఎఫ్’ లు..!

Actress Rakul Preet Singh Speaks About Her Three Most Favorite Things In Her Life In An Interview Given For A TV Channel

తన జీవితం మూడు ఎఫ్ లతో ముడిపడి ఉందని చెపుతుంది రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ తన సినీ రంగ ప్రవేశం గురించి… తనకు ఎలాంటి అబ్బాయి కోసం చూస్తుందో ఇలా పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఒక మనిషిగా నేను కూడా మారుతుంటాను.. నా దృష్టిలో ప్రేమ అంటే అర్ధం నేను మా పేరెంట్స్ లో చూసేదే.. ప్రేమ, పెళ్లి పై నాకు పూర్తి నమ్మకం వుంది.. కొంతం మంది వాటి వల్ల ప్రెషర్ అంటారు అర్ధంకాదు.. నాకు తెలిసి ప్రేమ, పెళ్లి అనేవి చాలా గొప్పగా వుంటాయని అనుకుంటున్నాను.. నావరకునేనైతే ఎవరినైనా ప్రేమిస్తే హార్ట్ ఫుల్ గా ప్రేమిస్తా అని చెప్పుకొచ్చింది. అంతే కాదు తనకంటే పొడవు.. తను హీల్స్ వేసుకున్నా సరే పైకెత్తి చూసేంత ఎత్తు.. ఇంటెలిజెంట్ అయి ఉండాలని తెలిపింది. ప్రస్తుతం నాలైఫ్ లో మూడు ఎఫ్ లకు ప్రాధాన్యత వుంది.. ఫస్ట్ ఫిలిమ్స్, ఆ తర్వాత ఫిట్ నెస్.. దాని తర్వాత ఫుడ్ అని తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా నేను ఎప్పుడూ నటిని అవ్వాలనే అనుకున్నాను.. దానికోసం 18వ ఏటనే మోడలింగ్ ద్వారా మార్గాన్ని చూసుకున్నా.. ఫస్ట్ ఫిలిం మాత్రం నా పాకెట్ మనీ కోసం చేసాను.. ఆ తర్వాత కన్నడలో నుండి నాకు అవకాశం వచ్చింది..ఇంకా తెలుగు, తమిళ్, హిందీ ఇప్పుడు ఈ పొజిషన్ లో వున్నాను అని చెప్పుకొచ్చింది.

ఇక సినిమాల విషయానికొస్తే తెలుగులో నితిన్ సరసన చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో నటిస్తుంది రకుల్. హిందీలో జాన్ అబ్రహాం “అటాక్ “, అర్జున్ కపూర్ ” ఛలే ఛలో ” మూవీస్ లో నటిస్తుంది. ఇక తమిళనాట కూడా రెండు సినిమాల్లో నటిస్తుంది. వీటితోపాటు వెబ్ సిరీస్ ల్లో కూడా నటించడానికి ఈ భామ ఇంట్రెస్ట్ చూపుతుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − five =