“సింహాద్రి ” మూవీ 17 సంవత్సరాలు పూర్తి

SS Rajamouli Blockbuster Movie Simhadri Completes 17 Years

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిందిన “స్టూడెంట్ నెం 1” మూవీ ఘనవిజయంసాధించిన విషయం తెలిసిందే. “స్టూడెంట్ నెం 1” మూవీ తో టాలీవుడ్ కు రాజమౌళి దర్శకుడిగా పరిచయం అయ్యారు. దర్శకుడు రాజమౌళి తన రెండవ మూవీ కూడా ఎన్టీఆర్ తో రూపొందించారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన యాక్షన్ డ్రామా “సింహాద్రి ” మూవీ 2003 సంవత్సరం జులై 9వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ “సింహాద్రి ” మూవీ ఈ రోజు తో 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరచిన సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. “సింహాద్రి ” మూవీ 52 సెంటర్స్ లో 175 డేస్ ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేసింది. తమిళ , కన్నడ , బెంగాలీ భాషలలో రీమేక్ అయ్యింది. “సింహాద్రి ” మూవీ టైమ్ లో ఎన్టీఆర్ వయసు 20 సంవత్సరాలుమాత్రమే. అంత చిన్న వయసులో ఎన్టీఆర్ స్టార్ హోదా అందుకున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం”మూవీ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 2 =