‘మిడిల్ క్లాస్ మెలోడీస్‌’ గా వస్తున్న ఆనంద్ దేవరకొండ..!

Dorasaani Movie Fame Anand Deverakonda Now Comes With His Latest Film Middle Class Melodies

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టేసాడు ఆనంద్ దేవరకొండ. వచ్చీ రాగానే ఫైట్స్, మాస్ ఎలిమెంట్స్ అని కాకుండా పాత్ర ప్రధానమైన కథను ఎంచుకున్నాడు. ఆనంద్‌ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన దొరసాని సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికీ నటినటులుగా ఇద్దరికీ మంచి పేరు వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు రెండో సినిమాను కూడా లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ భ‌వ్య క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ లో ఈ సినిమా రూపొందుతుంది. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. `మిడిల్ క్లాస్ మెలోడీస్‌` అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రం ద్వారా వినోద్ అనంతోజు ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతుండగా.. వెనిగ‌ళ్ళ ఆనంద‌ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనట్టు తెలుస్తుంది. ఈ వేస‌వికి చిత్రాన్ని విడుద‌ల చేయాల‌నుకున్నారు కానీ…లాక్ డౌన్ ప‌రిస్థితుల వ‌ల్ల విడుద‌ల‌ను వాయిదా వేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =