5ఏళ్ల బాహుబలి.. ఎన్నో రికార్డులు ..!

5 Years for India's Biggest Blockbuster Baahubali

తెలుగు సినీ చరిత్రలో బాహుబలి సిరీస్ ఒక కొత్త అధ్యయనాన్ని లిఖించిందని చెప్పడంలో సందేహం లేదు. రాజమౌళి ఎంతో జాగ్రత్తగా చెక్కిన శిల్పమే ఈ బాహుబలి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ,నాజర్, సత్యరాజ్‌ వంటి ప్రధాన పాత్రలతో రాజమౌళి తెరకెక్కించిన ’బాహుబలి’ భారతీయ సినీ చరిత్రలోనే గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా మొదటి పార్ట్ విడుదలై నేటితో 5 ఐదేళ్లు పూర్తి చేసుకుంది. భారీ సెట్టింగులు, అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్, ఆకట్టుకునే కథ, కథనాలు, రాజమౌళి మార్క్ టేకింగ్, సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ఈ సినిమా సక్సెస్ కు ప్రధాన కారణాలు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాజమౌళి టేకింగ్ గురించి అందరికీ తెలిసిందే. తనకి కావాల్సిన అవుట్ పుట్ వచ్చేంత వరకూ అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. లేట్ అయినా పర్లేదు క్వాలిటీ అవుట్ రప్పించుకుంటాడు. అందుకే ఈ సినిమా కూడా ఆ రేంజ్ లో ఉంటుంది. ప్ర‌తి ఫ్రేంని హాలీవుడ్ స్థాయిలో తెర‌కెక్కించాడు. అందుకే దేశ వ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో కూడా సంచలనాలు నమోదు చేసిన తొలి చిత్రంగా ‘బాహుబలి’ రికార్డులకు ఎక్కింది.

సినిమా రిలీజ్‌కి ముందే వారి వారి పాత్ర‌ల‌తో పోస్ట‌ర్స్ విడుద‌ల చేసి సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాడు రాజ‌మౌళి. మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పినా తక్కువే. ఇక సెకండ్ పార్ట్ కు అయితే పెద్దగా ప్రమోషన్ కూడా అవసరం లేకుండా పోయింది. బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడ‌నే ఒక్క ప్రశ్న దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది. ఈ ఒక్క ప్రశ్న సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ చేసిపెట్టింది.

ఇక ఈ సినిమా సాధించిన రికార్డ్స్ అన్నీ ఇన్నీ కాదు. బాహబలి మొదటి పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 650 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. టాలీవుడ్‌కు సంబంధించి ఒక్క తెలుగు సినిమా 100 కోట్ల‌కు పైగా వ‌సూలు చేయ‌డం.. బ‌హుబ‌లితోనే మొద‌లైంది. ఇప్పుడు ఎన్నో సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నా బాహుబలి కలెక్షన్స్ ను దాటడం కష్టమే. అంతేకాదు ఈ సినిమాతో ప్రభాస్‌కు ‘రష్యా ఆడియన్స్ హార్ట్’ అవార్డు దక్కింది. ఉత్తమ చిత్రంగా స్వర్ణ కమలం అందుకున్న చిత్రంగా బాహుబలి రికార్డులకు ఎక్కింది

ఇక ప్రభాస్ గురించి చెప్పేదేముంది. ఒక్క సినిమా కోసం దాదాపు 5ఏళ్ళు మరే సినిమా చేయకుండా.. ఈ సినిమా కోసమే తన డేట్స్ ఇచ్చాడంటే ప్రభాస్ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ప్రభాస్ స్థానంలో మరొక హీరో ఉంటే ఇంత ధైర్యం చేసుండేవాళ్లు కాదేమో. ఫైనల్ గా తన నమ్మకానికి తగిన ఫలితమే దక్కింది. ప్రాంతీయ స్థాయి నుండి.. జాతీయ అంతర్జాతీయ.. ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు.

భళ్లాలదేవుడిగా రానా, రాజమాత శివగామిగా రమ్యకృష్ణ, కట్టప్పగా సత్యరాజ్, బిజ్జాలాదేవుడిగా నాజర్, అవంతికగా తమన్నా, దేవసేనగా అనుష్క నటన ఈ సినిమాకు మరో హైలెట్. మరి తెలుగు సినీ చరిత్రలో ఇలాంటి కావ్యాలు ఎన్నో రావాలని.. మన తెలుగుసినిమా ఖ్యాతి, సత్తా అందరికీ తెలియాలని కోరుకుందాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + three =