సక్సెస్ ఫుల్ “ఏ మాయ చేసావె ” మూవీ తో సమంత టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో జెస్సీ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సమంత ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి సమంత బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. తన తొలి చిత్ర హీరో నాగచైతన్య ను వివాహం చేసుకుని సమంత ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. సమంత ప్రస్తుతం ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత “ఓ బేబీ ” మూవీ ఘనవిజయం సాధించడంతో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ పై ఆసక్తి చూపుతున్నారు. స్టార్ డమ్ గురించి సమంత మాట్లాడుతూ .. తనకు దక్కిన స్టార్ డమ్ అంతా అదృష్టమే నని , చిత్ర పరిశ్రమలో రావడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారని, వారితో పాటు సినీ ఫీల్డ్ లో అందంగా ఉండేవారు , బాగా నటించే వాళ్ళు ఉన్నా దేవుడి దయ వల్ల , అదృష్టం వల్ల తనకు అరుదైన అవకాశం లభించిందని , ఇదంతా గాడ్ గిఫ్ట్ అనుకుంటానని , తనకు వచ్చిన ఆఫర్స్ లలో పాత్రకు న్యాయం చేస్తూ కష్టపడి నటిస్తానని సమంత చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























