3 మిలియన్ స్ట్రాంగ్.. నా ఫాలోవర్స్ కి పెద్ద థ్యాంక్స్..!

Tollywood Actor Nithiin Hits 3 Million Follower Mark On Twitter

సెలెబ్రటీస్ అందరూ సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గానే ఉంటారు. ఒకప్పుడు అంటే ఏదో కొంతమంది మాత్రమే సోషల్ మీడియాల్లో యాక్టీవ్ గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తమ అప్ డేట్స్ ఇస్తూ.. ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఇటీవల మహేష్ బాబు, ప్రభాస్, పూజా హెగ్డే, విజయదేవరకొండ మిలియన్స్ లలో అభిమానులను సొంతం చేసుకొని రికార్డ్స్ క్రియేట్ చేయగా.. ఇక ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నితిన్ కూడా ట్విటర్‌లో 3 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా ట్విటర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నాడు. 3 మిలియన్ స్ట్రాంగ్! నా ప్రయాణంలో తోడుగా ఉండి నాపై ఇంతగా ప్రేమ చూపిస్తున్న నా ఫాలోవర్స్ అందరికీ పెద్ద థ్యాంక్స్` అని ఆనందాన్ని వ్యక్తం చేసాడు.


చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ‘భీష్మ’ సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు నితిన్. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన కిక్ తో వరుసగా ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టేసాడు. చంద్రశేఖర్ యేలేటి, ‘ఛల్ మోహన్ రంగా’ చేసిన కృష్ణచైతన్యతో అలాగే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అంధాదున్ రీమేక్ చేస్తున్నాడు నితిన్.

ఇక ఇదిలావుండగా త్వరలో యంగ్ హీరో నితిన్ పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 26న ఫలక్‌నామా ప్యాలస్‌ వేదికగా.. కేవలం ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిపేందుకు నిశ్చయించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − nineteen =