సూపర్ హిట్ “ఏ మాయ చేసావె ” మూవీ తో నటుడిగా సినీ కెరీర్ ప్రారంభించిన సుధీర్ బాబు “శివ మనసులో శృతి ” మూవీ తో హీరోగా మారారు. “ప్రేమ కథా చిత్రమ్ “, భలే మంచి రోజు “, “సమ్మోహనం ” వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “బాఘీ ” మూవీ లో ప్రతినాయకుడిగా సుధీర్ బాబు బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పేరు తో ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి “నన్నుదోచుకుందువటే”మూవీ లో సుధీర్ బాబు నటిస్తూ , నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యత నిచ్చే సుధీర్ బాబు కరోనా లాక్ డౌన్ కారణం గా జిమ్ కు వెళ్ళే పరిస్థితి లేకపోవడం తో ఇంటి లోనే వర్కౌట్స్ చేస్తున్నారు. ఫిట్ నెస్ రోగ నిరోధక శక్తి ని పెంచుతుందని సుధీర్ బాబు సూచనలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సుధీర్ బాబు తన వర్కౌట్ వీడియోస్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఆ వర్క్ అవుట్ వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. తమ అభిమాన హీరో భారీ వర్కౌట్ వీడియోస్ చూసి అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: