శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టాడు శైలేష్ కొలను. ఇక ఈ సినిమా హిందీలో కూడా రీమేక్ కు సిద్ధమైంది. ఈ రీమేక్ కు కూడా శైలేష్ కొలనే దర్శకత్వం వహించనున్నాడు. హిందీ రీమేక్ లో రాజ్ కుమార్ రావు నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను 2021 సంవత్సరంలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా శైలేష్ కొలను తన ఇన్స్టా లో ఒక పోస్ట్ చేయగా దానిపై నెటిజన్స్ చమత్కారంగా స్పందిస్తున్నారు. ఆ వీడియోలో విశ్వక్ సేన్, శైలేష్ కొలను వున్నారు. శైలేష్ కొలను తన దగ్గర ఒక కథ ఉంది అని అంటుండగా.. విశ్వక్ సేన్ కామెడీ చేస్తున్నాడు. అంతేకాదు వీడియో పోస్ట్ చేసిన శైలేష్ దానికి.. పూరీ జగన్నాథ్ సర్ ఇదొకటి నేర్పించారు మా విశ్వక్ సేన్ కి.. ఇట్లా తొక్కేస్తున్నాడు మమ్మల్ని.. బాయ్స్ చూడండి.. మీ అన్న ఎట్లా చేస్తున్నాడో.. అన్యాయం కాదు..? అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు. ఇక ఈ పోస్ట్ పై నెటిజన్స్ కామెడీగా స్పందిస్తున్నారు.
కాగా ‘హిట్’ సినిమాతో మంచి ఫామ్ కి వచ్చిన విశ్వక్ సేన్ ప్రస్తుతం లక్కీ మీడియా బ్యానర్ పై నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వంలో ‘పాగల్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు మాత్రమే ముగించుకుంది. సెట్స్ పైకి వెళ్ళేలోపు కరోనా వచ్చిపడింది. దీనితో పాటు మొహమ్మద్ ముస్తాఫా దర్శకత్వంలో తెరకెక్కిన ‘కప్పేల’ సినిమాలో ఒక కీలక పాత్రలో విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: