సీనియర్ నిర్మాత ఎంఎస్ రాజు దాదాపు 12ఏళ్ల తరువాత ‘డర్టీ హరి’ అనే సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఇక తన గత చిత్రాలకు భిన్నంగా బోల్డ్ కాన్సెప్ట్ తో డర్టీ హరి మూవీని ఎం ఎస్ రాజు తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ను చూస్తుంటే. ఇక ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ట్రైలర్ త్వరలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. చెప్పినట్టే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రవణ్ రెడ్డి హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంతో వెండి తెరకు పరిచయం అవుతున్నాడు శ్రవణ్ రెడ్డి. సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎస్.పి.జి. క్రియేషన్స్ పతాకం పై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగులు ఎంఎస్ రాజు రాయడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: