‘అప్పట్లో ఒకడుండేవాడు’ అంటూ తనపై వరుణ్ కామెడీ.. ..!

Varun Sandesh's Throwback Picture Goes Viral

హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, కొత్త బంగారు లోకం సినిమాతో సూపర్ హిట్టు కొట్టి ఆ తర్వాత వరుస అవకాశాలను సంపాదించుకున్నాడు వరుణ్ సందేశ్. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవి వరుణ్ కు పెద్దగా సక్సెస్ ను అందించలేకపోయాయి. ఇక 2015లో వచ్చిన లవకుశ సినిమాలో చివరగా కనిపించాడు వరుణ్. కొత్త కొత్త హీరోలు ఎంట్రీ ఇస్తుండటంతో వరుణ్ కు కూడా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అలా సినిమాలకు దాదాపు చాలా ఏళ్ళు దూరంగానే ఉన్నాడు. ఇక ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని తన వైఫ్ వితికతో కలిసి బిగ్ బాస్ 3 లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో చివరివరకు ఉండి, నాలుగో స్థానంలో నిలిచి హౌస్ నుండి బయటకు వచ్చేసాడువరుణ్..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా వరుణ్ తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫొటో ఒకటి వైరల్ గా మారింది. తన టీనేజ్ లో వున్న ఒక ఫొటోను పోస్ట్ చేస్తూ తన ఫోటోకు తానే కామెడీగా అప్పట్లో ఒకడుండేవాడు అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. ఇక కూలీ అవతారంలో ఉన్న వరుణ్ ఫొటోను చూసి పలువురు నెటిజన్స్ కామెంట్స్ తో పాటు కామెడీ కూడా చేస్తున్నారు.

 

View this post on Instagram

 

#AppatloOkkadundevadu

A post shared by Varun Sandesh (@itsvarunsandesh) on

ఇక బిగ్ బాస్ నుండి బయటకి వచ్చిన తర్వాత వరుణ్ పలు వెబ్ సిరీస్ లు చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు బిగ్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వడానికి.. స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కోసం చూస్తున్నాడట. ఈ నేపథ్యంలో కొన్ని కథలను కూడా లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. ఆ వివరాలు త్వరలోనే తెలియచేయనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − two =