సాధారణ పరిస్థితుల కోసం ఎదురుచుస్తున్నా..!

Gaddalakonda Ganesh Actor Varun Tej Shares His Current Mood With His Latest Pic Posted On Instagram

ప్రస్తుతం అందరి ఆలోచనా ఒకటే.. ఈ కరోనా వైరస్ ప్రభావం ఎప్పుడు తప్పుతుంది.. ఎప్పుడు సాధారణ పరిస్థితులు వస్తాయి అని. సామాన్య ప్రజలనుండి సెలబ్రిటీస్ వరకూ అందరూ ఇదే కోరుకుంటున్నారు. ఇక సినీ సెలబ్రిటీస్ కు అయితే ఒకింత కష్టమే అని చెప్పొచ్చు. ఎప్పుడూ షూటింగ్స్, సినిమాలు, ప్రమోషన్స్ అంటూ బిజీ బిజీగా వుండే వాళ్ళకి ఇన్నిరోజులు ఒకేప్లేస్ లో ఎక్కడికీ వెళ్లకుండా ఉండాలంటే వారికి చాలా కష్టం. ఫ్యామిలీతో కాలక్షేపం చేసిన కొద్దిరోజులు అంటే ఉండగలరు కానీ ఇలా నెలలు నెలలు ఉండాలంటే ఇబ్బందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై వరుణ్ తేజ్ కూడా తన ఇన్స్టాలో కొత్త పోస్ట్ పెట్టాడు. ‘కరోనా నుండి త్వరలో ఈ ప్రపంచం సాధారణ స్థితికి రావాలని తాను ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. అలాగే పోస్ట్ తో పాటు తను సోఫాలో రిలాక్స్డ్ గా కూర్చున్న ఫోటో పోస్ట్ చేసాడు. ఇంతకుముందు కూడా వరుణ్ బ్లర్ గా ఉన్న ఒక ఫొటో ను పోస్ట్ చేసి ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో.. ఫొటో కూడా అలానే ఉందని కామెడీ చేసాడు.

 

View this post on Instagram

 

Just waiting for the world to come back to normalcy!

A post shared by Varun Tej Konidela (@varunkonidela7) on


ప్రస్తుతం వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు. ఇక “ఫిదా “, “తొలి ప్రేమ “, “F 2”, “గద్దలకొండ గణేష్ ” ఇలా వరుస హిట్స్ తో ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు వరుణ్ తేజ్. మరి ఈసినిమా ఎంత వరకూ సక్సెస్ ను అందిస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 18 =